RGV : మరో వివాదంలో ఆర్జీవీ.. ఈటెల రాజేందర్ పై ఆర్జీవీ సినిమా

ఆర్జీవీ ఇటీవలే తెలంగాణ రాజకీయాలపై, మావోయిస్టులపై సినిమా తీస్తాను అంటూ కొండా సురేఖ దంపతుల బయోపిక్ ని ప్రకటించాడు. ఇప్పుడు ఆర్జీవీ ఈటెల రాజేందర్ పై సినిమా అంటూ అందరికి షాక్ ఇచ్చారు.

RGV : మరో వివాదంలో ఆర్జీవీ.. ఈటెల రాజేందర్ పై ఆర్జీవీ సినిమా

Rgv

RGV :  ఎప్పుడు వివాదాల్లోకి వెల్దామా అంటూ ఎదురు చూస్తాడు ఆర్జీవీ. రకరకాల ట్వీట్లు చేస్తూ రకరకాల కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తూ ఉంటాడు ఆర్జీవీ. ఇన్నాళ్లు ఏపీ రాజకీయాల పై సినిమాలు తీసి, ఏపీ రాజకీయాలపై ట్వీట్లు చేసి ఇప్పుడు తెలంగాణ రాజకీల్లోకి తల దూరుస్తున్నాడు. ఇటీవలే తెలంగాణ రాజకీయాలపై, మావోయిస్టులపై సినిమా తీస్తాను అంటూ కొండా సురేఖ దంపతుల బయోపిక్ ని ప్రకటించాడు. షూటింగ్ కూడా మొదలుపెట్టాడు.

ఇప్పుడు తాజాగా మరో సినిమాని ప్రకటించాడు ఆర్జీవీ. ఇటీవల ఈటెల రాజేందర్ ని తెరాస పార్టీ నుంచి, పదవి నుంచి సాగనంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈటెల బిజెపి నుంచి హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఒకపక్క ఎలక్షన్స్ వేడిలో ప్రచారాలు భారీగా జరుగుతుంటే ఇప్పుడు ఆర్జీవీ ఈటెల రాజేందర్ పై సినిమా అంటూ అందరికి షాక్ ఇచ్చారు.

NTR : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షూటింగ్ కి బ్రేక్.. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ??

ఈ సినిమా గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. నాకెందుకో ఈటల రాజేందర్ కేసీఆర్ కు వెన్నుపోటు, ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు సేమ్ అనిపించింది. అందుకే ఈటెల కెసిఆర్ కి వెన్నుపోటు పొడిచిన విధానాన్ని తెలంగాణ రాజకీయ మేధావులని కనుక్కుని సినిమా తీస్తా అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఆ సినిమాకి ‘వెన్నుపోటు ఈటెలు’ అని టైటిల్ పెట్టి ఒక పోస్టర్ కూడా జోడించారు. ఇప్పుడు ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో, హుజురాబాద్ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపిస్తుందేమో చూడాలి. తర్వాత ఆర్జీవీ ఆ ట్వీట్ ని తీసేయడం గమనార్హం.