RGV : ఆర్జీవీ ఆఫీస్ చూశారా? డాన్స్ డెన్ కూడా సరిపోదు.. వైరల్ అవుతున్న RGV డెన్ వీడియో..

ఆర్జీవీ సినిమా తీసినా, ట్వీట్ చేసినా, దేని గురించి అయినా మాట్లాడినా వైరల్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఆర్జీవీ ఆఫీస్ కూడా వైరల్ గా మారింది.

RGV : ఆర్జీవీ ఆఫీస్ చూశారా? డాన్స్ డెన్ కూడా సరిపోదు.. వైరల్ అవుతున్న RGV డెన్ వీడియో..

RGV Office RGV DEN video goes viral surprising everyone after watching it

Updated On : June 11, 2023 / 10:15 AM IST

RGV DEN : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(Rgv) గురించి అందరికి తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) లో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆర్జీవీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం నా ఇష్టం అంటూ ఏవేవో సినిమాలు చేస్తున్నాడు. అయినా కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు. ఇక సోషల్ మీడియాలో, యూట్యూబ్(Youtube) లో తన ఫిలాసఫీ మాటలతో అందర్నీ ఇంప్రెస్ చేస్తూ ఉంటున్నాడు. అతన్ని పొగిడేవాళ్లు ఎంతమంది ఉన్నా అతన్ని తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. అయినా ఆర్జీవీ అవేమి లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోతాడు.

ఆర్జీవీ సినిమా తీసినా, ట్వీట్ చేసినా, దేని గురించి అయినా మాట్లాడినా వైరల్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఆర్జీవీ ఆఫీస్ కూడా వైరల్ గా మారింది. ఆర్జీవీ ఇటీవల హైదరాబాద్ లో ఓ కొత్త ఆఫీస్ నిర్మించారు. ఈ ఆఫీస్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే. సినిమాల్లో డాన్ లకు చూపించే డెన్ లాగా దీన్ని తయారు చేశారు. లోపల అంతా కూడా ఆర్జీవీ సినిమాలు, ఆర్జీవీ సినిమాల ఫొటోలు, సెలబ్రిటీలతో ఆర్జీవీ ఫొటోలు, ఆర్జీవీ హీరోయిన్స్ ఫొటోలు, ఆర్జీవీ చెప్పిన కొటేషన్లతో, గ్రీనరీతో, కొండలు, గుహలు ఉన్నట్టు అద్భుతంగా డిజైన్ చేశారు.

Balakrishna : బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో.. సూట్‌లో అదరగొట్టిన బాలయ్య..

తాజాగా ఆర్జీవీ ఛానల్ లో ఇదంతా ఆర్జీవీ ఆఫీస్ టూర్ అని వీడియోని పెట్టగా అది వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆర్జీవీ ఆఫీస్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక్కసారన్నా ఆ ఆఫీస్ కి వెళ్లాలంటూ, ఆర్జీవీ ఏం చేసినా వైరల్ అవ్వాల్సిందే అంటూ, ఆఫీస్ మాత్రం అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ కి బయట పెద్దది ఆర్జీవీ బొమ్మ పెట్టి RGV DEN అని రాశారు. దీంతో ఇప్పుడు ఆర్జీవీ కొత్త ఆఫీస్ చర్చగా మారింది.