Road Accident: ముందు ట్రాలీ.. వెనుక మినీ లారీ.. మధ్యలో నలిగిపోయిన కార్

ఒకేసారి ఆరు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు.

Road Accident: ముందు ట్రాలీ.. వెనుక మినీ లారీ.. మధ్యలో నలిగిపోయిన కార్

Road Accident

Updated On : October 18, 2021 / 12:20 PM IST

Road Accident: ఒకేసారి ఆరు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు. ఖోపొలి సమీపంలో ఉన్న ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వే మీద జరిగిన రోడ్ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉదయం 5గంటల 30నిమిషాల సమయంలో కోళ్లను తీసుకెళ్లే వాహనమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.

ఉన్నట్టుండి కోళ్లను తీసుకెళ్లే ట్రాలీ వ్యాన్ ఆగిపోయింది. వెనుకనే వస్తున్న కార్ డ్రైవర్ హఠాత్పరిణామాన్ని ఊహించలేకపోవడంతో కారు వ్యానులోకి దూసుకెళ్లిపోయింది. కార్ వెనుకగా వస్తున్న మినీ లారీ అదే వేగంతో వెళ్లి బ్రేక్ వేసినప్పటికీ కార్ వెనుకభాగం కూడా చిత్తయిపోయింది. యాక్సిడెంట్ తర్వాత నలిగిపోయిన కారులో నుంచి బాధితులను బయటకు తీశారు.

వెంటనే ఘటానాస్థలానికి చేరుకున్న రెస్క్యూ ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి, తీవ్రంగా గాయపడ్డా ఆరుగురికి ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్ కు పంపారు.

…………………………………………. : పట్టపగలు పోలీసు గ్రౌండ్‌లో మద్యం సేవించిన పోలీసు వీడియో వైరల్

Road Accident 2

Road Accident 2