Crazy Uncles: శ్రీముఖి కోసం ఆర్ఆర్ఆర్ ఆరాటం..!

ఔను.. శ్రీముఖి కోసం ఆర్ఆర్ఆర్ ఎంతగానో ఆరాట పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ అంటే రాజమౌళి తెరకెక్కించే ఆర్ఆర్ఆర్ కాదు.. రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్

Crazy Uncles: శ్రీముఖి కోసం ఆర్ఆర్ఆర్ ఆరాటం..!

Crazy Uncles

Crazy Uncles: ఔను.. శ్రీముఖి కోసం ఆర్ఆర్ఆర్ ఎంతగానో ఆరాట పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ అంటే రాజమౌళి తెరకెక్కించే ఆర్ఆర్ఆర్ కాదు.. రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్ శ్రీముఖి కోసం ఆరాటపడుతున్నారు. ఇదే కథాంశంతో త్వరలోనే క్రేజీ అంకుల్స్ అనే సినిమా రాబోతుంది. యాంకర్ శ్రీముఖి వెండితెరమీద కూడా చాలాకాలంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలలో ముఖ్య పాత్రలలో నటించిన శ్రీముఖి ఇప్పుడు ప్రధాన పాత్రగా క్రేజీ అంకుల్స్ అనే సినిమా తెరకెక్కింది.

నటులు భరణి, రాజారవీంద్ర, సింగర్ మనో ప్రధాన పాత్రలుగా శ్రీముఖి నటించిన స్వీటీ అనే పాత్ర చుట్టూ తిరిగే కథతో తెరకెక్కించిన సినిమా క్రేజీ అంకుల్స్ ఇప్పుడు ప్రేక్షకులలో ఆసక్తిగా మారింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 19న థియేటర్లలో రిలీజ్ కాబోతుండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ట్రైలర్ ను బట్టి చూస్తే ఈ సినిమా కామెడీ ప్రధానంగా తెరకెక్కించినట్లుగా కనిపిస్తుంది.

ఇది హైదరాబాద్‌లో ఉంటున్న రాజు, రెడ్డి, రావు(ఆర్ఆర్ఆర్)ల కథ అని ట్రైలర్ ద్వారా చెప్పుకొచ్చారు. ఈ ముగ్గురు ఉండే అపార్ట్‌మెంట్‌లోకి అనుకోకుండా ఓ అందమైన అమ్మాయి అడుగుపెట్టగా.. ఎలాగైనా ఆ అమ్మాయితో గడపాలని ఈ ముగ్గురు అంకుల్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆ ముగ్గురి కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఈ సినిమా కథ. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ అయిన ఇ.సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్, గ్రీన్ మెట్రో మూవీస్‌, శ్రీవాస్ 2 క్రియేటీవ్స్ బ్యానర్స్‌ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.