జూన్ 14 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం, మార్గదర్శకాలు జారీ

అయ్యప్ప భక్తులకు శుభవార్త. కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. జూన్ 14 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులను

  • Published By: naveen ,Published On : June 7, 2020 / 08:41 AM IST
జూన్ 14 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం, మార్గదర్శకాలు జారీ

అయ్యప్ప భక్తులకు శుభవార్త. కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. జూన్ 14 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులను

అయ్యప్ప భక్తులకు శుభవార్త. కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. జూన్ 14 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. కాగా, దర్శనానికి టోకెన్ విధానం అమలు చేస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. దాదాపు మూడు నెలల తర్వాత నెలవారీ పూజల కోసం జూన్ 14న అయ్యప్ప ఆలయం తెరుచుకోనుండగా.. ఐదు రోజుల పాటు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అది కూడా ప్రస్తుతం కేరళ భక్తులకు మాత్రమే అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 15న మలయాళం మాసం మిథునం ప్రారంభం కానుండగా.. శబరిమల ఆలయంలో జూన్ 19 నుంచి 28వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించనున్నారు.

భక్తులు పాటించాల్సిన నియమాలు:
* భక్తులకు మాస్కుధారణ నిబంధన తప్పనిసరి. 
* స్వామివారి సన్నిధానం దగ్గరికి ఏకకాలంలో 50 మందినే అనుమతిస్తారు. 
* వారు వెళ్లాకే, మరో బ్యాచ్‌ను పంపుతారు. 
* భక్తులు ముందుగానే ‘వర్చువల్‌ క్యూ’ (virtual que system) వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలి. 
* దర్శనానికి రెండు స్లాట్లే ఉంటాయి (ఉదయం 4 నుంచి మ.1 గంట వరకు.. తిరిగి మ.4 నుంచి రా.    11 గంటల వరకు)
* ప్రసాదాల(అప్పం, అవరణ పాయసం) కోసం ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. 

* ఇతర రాష్ట్రాల భక్తులు కేరళ ప్రభుత్వ ‘జాగ్రత్త’(COVID Jagrata pass registration portal) పోర్టల్‌లో రిజిస్టర్‌ చేయించుకుని, ఈ-పాస్‌ తీసుకోవాలి. 
* కొవిడ్‌ పరీక్ష చేయించుకుని ఉండాలి.
* గంటకు కేవలం 200 మంది భక్తులను మాత్రమే అనుమతి.
* రద్దీని నియంత్రించడానికి సన్నిధానం ముందు 50 మందినే అనుమతి. 
* పంబ వరకే వాహనాలకు అనుమతి. 
* స్వామి దర్శనానికి ముందు పంబ, సన్నిధానంలో థర్మల్ స్క్రీనింగ్. 
* శబరిమలలో భక్తులకు ఎలాంటి వసతి కల్పించరు.

ఆచారం ప్రకారం భక్తులు మాసపూజ, శబరిమల ఉత్సవాల్లో పాల్గొనేందుకు అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నట్లు దేవస్థానం మంత్రి సురేంద్రన్ తెలిపారు. ఇక కేరళలోని మరో పుణ్యక్షేత్రం గురువాయూర్‌లో భక్తులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఆలయాన్ని తెరిచే తేదీని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. రోజుకు 60 పెళ్లిళ్లకే అనుమతి ఉండనుంది. గంటకు 150 మంది చొప్పున రోజుకు 600 మందిని మాత్రమే అనుమతించనున్నారు. ఇక్కడ కూడా టైమ్ స్లాట్ విధానం అమలు చేయనున్నారు. మార్చి 24 తర్వాత గురవాయూర్‌లో వివాహాలను నిలిపివేశారు.