Cyclist Team: కోచ్‌పై ఆరోపణలు.. భారత బృందాన్ని వెనక్కు పిలిచిన శాయ్

కోచ్‌పై ఆరోపణలు రావడంతో విదేశంలో ఉన్న భారత సైక్లిస్టుల బృందాన్ని వెనక్కు రప్పించాలని నిర్ణయించింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్). ఇటీవల ఒక మహిళా సైక్లిస్టు కోచ్‌పై ఆరోపణలు చేసింది.

Cyclist Team: కోచ్‌పై ఆరోపణలు.. భారత బృందాన్ని వెనక్కు పిలిచిన శాయ్

Cyclist Team

Cyclist Team: కోచ్‌పై ఆరోపణలు రావడంతో విదేశంలో ఉన్న భారత సైక్లిస్టుల బృందాన్ని వెనక్కు రప్పించాలని నిర్ణయించింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్). ఇటీవల ఒక మహిళా సైక్లిస్టు కోచ్‌పై ఆరోపణలు చేసింది. త్వరలో జరగనున్న ఒక కాంపిటీషన్‌కు సంబంధించి శిక్షణ కోసం కొద్ది రోజుల క్రితం భారత సైక్లిస్టుల బృందం స్లొవేనియా వెళ్లింది. ఈ బృందంలో కోచ్‌తోపాటు, ఐదుగురు పురుష సైక్లిస్టులు, మరో మహిళా సైక్లిస్టు ఉన్నారు. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఈ శిక్షణ జరుగుతోంది. అయితే, స్లొవేనియాలో కోచ్ ఆర్‌కే శర్మ తనతో అనుచితంగా ప్రవర్తించాడని మహిళా సైక్లిస్టు శాయ్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.

Virat Kohli: ఇన్‌స్టాలో 20 కోట్ల ఫాలోవర్లతో కోహ్లీ రికార్డు.. దేశంలోనే నెంబర్ 1

దీనిపై స్పందించిన శాయ్ ఆమె భద్రత రీత్యా ఇండియా తిరిగి రావాలని మంగళవారం సూచించింది. తాజాగా భారత బృందం మొత్తాన్ని వెనక్కు రావాలని ఆదేశించింది. కోచ్‌తోపాటు అందరూ వెంటనే భారత్ రావాలని కోరింది. నిజానికి ఈ శిక్షణ ఈ నెల 14 వరకు జరగాల్సి ఉంది. అయితే, ముందుగానే బృందం భారత్ రాబోతుంది. మరోవైపు మహిళా సైక్లిస్టు చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు శాయ్, సీఎఫ్ఐ వేర్వేరుగా కమిటీలు ఏర్పాటు చేశాయి. అలాగే ఈ అంశంపై కోచ్ ఆర్‌కే శర్మ నుంచి వివరణ కూడా కోరనున్నాయి.