Sai Dharam Tej : నేనెప్పుడూ అతనికి డబ్బులిచ్చానని చెప్పలేదు.. నాపై వస్తున్న తప్పుడు వార్తలకు ఇదే ఆఖరి వివరణ..

ఫర్హాన్ కి సాయి ధరమ్ తేజ్ సహాయం చేశాడు, డబ్బులు ఇచ్చాడు అనే వార్తలపై స్పందిస్తూ ఓ లెటర్ రాసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు తేజ్.

Sai Dharam Tej : నేనెప్పుడూ అతనికి డబ్బులిచ్చానని చెప్పలేదు.. నాపై వస్తున్న తప్పుడు వార్తలకు ఇదే ఆఖరి వివరణ..

Sai Dharam Tej gives clarity in Farhan Issue Tweet goes Viral

Updated On : April 28, 2023 / 9:10 AM IST

Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) యాక్సిడెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కోలుకున్నాక ఇటీవలే విరూపాక్ష(Virupaksha) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తన యాక్సిడెంట్ టైంలో జరిగిన విషయాలు, అతను పడ్డ బాధలు.. ఇలా అన్ని షేర్ చేసుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయినప్పుడు ఫర్హాన్ అనే వ్యక్తి గుర్తించి సాయం చేసి తేజ్ ని త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్లేలా చేశాడు. అప్పట్లో ఇతని పేరు బాగా వైరల్ అయింది.

ఇప్పుడు విరూపాక్ష ప్రమోషన్స్ లో కూడా తేజ్.. అతన్ని గుర్తు చేసుకుంటూ అతని సాయం మరువలేనిది. అతనికి జీవితాంతం రుణపడి ఉంటాను. అతనికి డబ్బులిచ్చి చేతులు దులిపేసుకోలేను. కానీ అతనికి సాయం కావాల్సి వస్తే నేను చేస్తాను అని చెప్పారు. దీంతో మరోసారి ఫర్హాన్ పేరు వైరల్ గా మారింది. కొన్ని సైట్లు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫర్హాన్ కి తేజ్ డబ్బులిచ్చాడని, సహాయం చేశాడని ఫేక్ వార్తలు వచ్చాయి. దీనివల్ల ఫర్హాన్ కూడా ఇబ్బంది పడ్డాడు. ఇదే విషయం మీడియా ముందుకు వచ్చి తేజ్ నాకెలాంటి సహాయం చేయలేదు, ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండి, దాని వల్ల నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఫర్హాన్ తెలిపాడు.

Samyuktha Menon : విరూపాక్ష డైరెక్టర్ కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త మీనన్.. ఏం ఇచ్చిందో తెలుసా?

తాజాగా సాయి ధరమ్ తేజ్ దీనిపై స్పందించాడు. ఫర్హాన్ కి సాయి ధరమ్ తేజ్ సహాయం చేశాడు, డబ్బులు ఇచ్చాడు అనే వార్తలపై స్పందిస్తూ ఓ లెటర్ రాసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు తేజ్. ఇందులో.. నాపై, నా టీం పై అసత్య ప్రచారాలు చేస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో నన్ను కాపాడిన ఫర్హాన్ కు నేను డబ్బు రూపంలో సహాయం చేసానని కొంతమంది రాస్తున్నారు. నేను కానీ, నా టీం కానీ ఎప్పుడూ అతనికి డబ్బులు ఇచ్చినట్టు చెప్పలేదు. నా ప్రాణాలు కాపాడిన ఆ వ్యక్తికి రుణపడి ఉంటాను అని మాత్రమే చెప్పాను. అతడి వద్ద మా వివరాలు ఉన్నాయని.. అతను సాయం కోరి వస్తే కచ్చితంగా చేస్తానని మాటిచ్చాను అని మాత్రమే చెప్పాను. నా మేనేజర్ ఎప్పుడూ అతనికి అందుబాటులో ఉంటాడు. ఈ విషయంపై ఇదే నా ఆఖరి వివరణ అని రాశారు. దీంతో సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.