Virupaksha : బాలీవుడ్‌లో విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముంబైలో ల్యాండ్ అయిన సాయి ధరమ్!

సాయి ధరమ్ విరూపాక్ష ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో నేడు బాలీవుడ్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.

Virupaksha : బాలీవుడ్‌లో విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముంబైలో ల్యాండ్ అయిన సాయి ధరమ్!

Sai Dharam Tej landed at mumbai airport for Virupaksha hindi pre release

Updated On : May 4, 2023 / 11:34 AM IST

Virupaksha : సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), సంయుక్త (Samyuktha Menon) జంటగా నటించిన మిస్టిక్ హారర్ థ్రిల్లర్ మూవీ విరూపాక్ష. కొత్త దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే ముందుగా తెలుగులో విడుదల చేసి, ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తరువాత ఇతర భాషల్లో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలుగులో సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ విడుదలకు సిద్దమవుతుంది.

Sai Dharam Tej : నేనెప్పుడూ అతనికి డబ్బులిచ్చానని చెప్పలేదు.. నాపై వస్తున్న తప్పుడు వార్తలకు ఇదే ఆఖరి వివరణ..

ఈ క్రమంలోనే హిందీలో గోల్డ్ మైన్స్ సంస్థ, తమిళంలో స్టూడియో గ్రీన్, మలయాళంలో E4 ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ లు ఈ మూవీ రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు. రేపు (మే 5) ఈ ఇతర బాషల ఆడియన్స్ ని కూడా బయపెట్టబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయా లాంగ్వేజ్ స్టేట్స్ లో విరూపాక్ష టీం సందడి చేస్తుంది. తాజాగా నేడు బాలీవుడ్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతుంది. ఇందుకోసం సాయి ధరమ్ ముంబై చేరుకున్నాడు. ముంబై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన సాయి ధరమ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan OG : పుణేలో పవన్ OG షూటింగ్.. సాంగ్ షూట్ జరుగుతుందా?

ఈ ఈవెంట్ కి ఎవరైన బాలీవుడ్ స్టార్ గెస్ట్ గా వస్తున్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా తెలుగులో సెకండ్ వీక్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం.. 12 రోజుల్లో 81 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని 100 కోట్ల వైపు దూసుకు పోతుంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ పాజిటివ్ టాక్ తో రిలీజ్ అవుతుండడంతో ఈ మూవీ మొత్తం మీద ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందో అని అందరిలో ఆసక్తి నెలకుంది.