Virupaksha : సూపర్ హిట్ విరూపాక్ష.. ఓటీటీలో నేటి నుంచే.. ఎందులో తెలుసా?

నెల రోజులుగా థియేటర్స్ లో మెప్పించిన విరూపాక్ష సినిమా నేటి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది.

Virupaksha : సూపర్ హిట్ విరూపాక్ష.. ఓటీటీలో నేటి నుంచే.. ఎందులో తెలుసా?

Sai Dharam Tej Virupaksha Movie streaming in Netflix

Updated On : May 21, 2023 / 1:04 PM IST

Virupaksha in OTT :  హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), సంయుక్త మీనన్(Samyuktha Menon) జంటగా కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరూపాక్ష(Virupaksha). ఏప్రిల్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్స్ లో ప్రేక్షకులని భయపెట్టి సస్పెన్స్, థ్రిల్లింగ్, ట్విస్టులతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడమే కాక మొదటి రోజు 12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి కొన్ని రోజుల తర్వాత పాన్ ఇండియా రిలీజ్ చేశారు. వేరే భాషల్లో కూడా విరూపాక్ష సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ లో ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

Ram Charan : ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో చరణ్ స్పీచ్.. నందమూరి వర్సెస్ మెగా వార్ ఇప్పటికైనా ఆగుతుందా?

నెల రోజులుగా థియేటర్స్ లో మెప్పించిన విరూపాక్ష సినిమా నేటి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో విరూపాక్ష సినిమా నేడు మే 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో మెగా అభిమానులతో పాటు, ఈ సినిమా థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూడటానికి రెడీ అయిపోయారు. థియేటర్స్ లో అదరగొట్టిన విరూపాక్ష ఓటీటీలో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.