Samantha : ఊ అంటావా.. ఊఊ అంటావా.. సాంగ్ ఇన్‌స్పైర్ చేసింది అంటున్న సల్మాన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

మోస్ట్ లిజనింగ్ ఐటమ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఊ అంటావా పాట సల్మాన్ ఖాన్ ని కూడా తెగ ఇంప్రెస్ చేసేసింది. తన సినిమాలో ఐటమ్ సాంగ్స్ తో..............

Samantha : ఊ అంటావా.. ఊఊ అంటావా.. సాంగ్ ఇన్‌స్పైర్ చేసింది అంటున్న సల్మాన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Salman Khan :  రిలీజ్ అయ్యి ఆర్నెల్లైనా ఇంకా ఆ పాట వింటే అదే క్రేజ్, అదే జోష్. ఫస్ట్ టైమ్ సమంత చేసిన ఐటం సాంగ్ అయినా లైఫ్ టైమ్ కి సరిపడా క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఊ అంటావా.. ఊఊ అంటావా అంటూ అందరి నోట్లో నానిన ఈ పాట చాలా మందిని ఇంప్రెస్ చేసింది. ఆర్నెల్ల నుంచి ఈ పాట పాడని సెలబ్రిటీ గానీ, సినిమా లవర్ గానీ లేరు. అంతలా సూపర్ డూపర్ కి మించిన బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ ఐటం సాంగ్ గా వచ్చిన ఈ పాట క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పుష్ప సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినా ఊ అంటావా… ఊ ఊ అంటావా… సాంగ్ మాత్రం ఇప్పుడు కూడా వినిపిస్తూనే ఉంది. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అందరూ ఈ పాటకి ఫిదా అయిపోయారు.

మోస్ట్ లిజనింగ్ ఐటమ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఊ అంటావా పాట సల్మాన్ ఖాన్ ని కూడా తెగ ఇంప్రెస్ చేసేసింది. తన సినిమాలో ఐటమ్ సాంగ్స్ తో సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్ తెస్తారు సల్మాన్ ఖాన్. అలాంటిది సల్మాన్ ఖాన్ కూడా సమంత స్పెషల్ సాంగ్ కి పడిపోయారు. రిలీజ్ అయ్యి ఆర్నెల్లు అవుతున్నా కూడా ఇంకా అదే మూడ్ లో అదే జోష్ లో ఈ పాట పాడారు సల్మాన్. ప్రెస్టీజియస్ ఐఫా ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ ని మిమ్మల్ని ఇటీవల ఇన్‌స్పైర్ చేసిన సాంగ్ ఏంటి అని అడగగా.. ఊ అంటావా.. ఊఊ అంటావా.. అని పాట పాడుతూ వెళ్ళిపోయాడు. సల్మాన్ ఈ పాట పాడిన వీడియో బైట్ ని సమంత షేర్ చేసి తన ప్రేమని చూపించింది.

Director Maruthi : అటు ప్రభాస్.. ఇటు చిరంజీవి.. మధ్యలో మారుతి..

అయితే నెటిజన్లు మాత్రం సల్మాన్ ని ట్రోల్ చేస్తున్నారు. సల్మాన్ కి ఈ పాట నచ్చడంలో తప్పులేదు. కానీ అక్కడ ఇన్‌స్పైర్ సాంగ్ అని అడిగితే ఐటెం సాంగ్ చెప్పడం ఏంటి? అందులో ఇన్‌స్పైర్ అవ్వడానికి సల్మాన్ కి ఏం కనపడిందో అంటూ నెటిజన్లు సల్మాన్ ని ట్రోల్ చేస్తున్నారు.