Pushpa-Samantha: స్పెషల్ సాంగ్ కూడా కాపీనేనా.. దేవిశ్రీపై ఆగని ట్రోల్స్!

ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ కాపీ ట్రోల్స్ ఎక్కువైపోయాయి. కొత్త సినిమాలు అందునా స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్, సాంగ్స్, ట్రైలర్స్ ఏవి రిలీజ్ అయినా ఇది అక్కడ నుండి కాపీ కొట్టారు..

Pushpa-Samantha: స్పెషల్ సాంగ్ కూడా కాపీనేనా.. దేవిశ్రీపై ఆగని ట్రోల్స్!

Pushpa

Pushpa-Samantha: ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ కాపీ ట్రోల్స్ ఎక్కువైపోయాయి. కొత్త సినిమాలు అందునా స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్, సాంగ్స్, ట్రైలర్స్ ఏవి రిలీజ్ అయినా ఇది అక్కడ నుండి కాపీ కొట్టారు.. ఈ మ్యూజిక్ ఆ సినిమాలోని పాటది.. ఈ ఫైట్ సీన్ ఫలానా హాలీవుడ్ సినిమా నుండి ఎత్తుకొచ్చారు అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అవి మన సినిమాలకు దగ్గరగా ఉండడంతో నెటిజన్లు అవును కాపీ క్యాట్ అంటూ ట్రోల్స్ మొదలు పెట్టడం షరా మామూలే అయిపొయింది.

Prabhas-Nithya Menen: ప్రభాస్‌ ఇష్యూ నన్ను ఇప్పటికీ బాధ పెడుతుంది: నిత్యా మీనన్

నిజానికి ఈ మధ్య కాలంలో థమన్ నుండి వచ్చిన ప్రతి సినిమా ఇలాంటి ట్రోల్స్ చూసేది. అయినా థమన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాజాగా వచ్చిన అఖండ థమన్ లేకపోతే సినిమా లేదు అనేంతగా థమన్ కి పేరుకొచ్చింది. కానీ.. సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం కామన్. ఇన్నాళ్లు థమన్ ను మాత్రమే ఆడేసుకున్న నెటిజన్లు ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ ను కూడా వదల్లేదు. ఐకాన్ స్టార్ తొలి పాన్ ఇండియా సినిమా పుష్పకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి పాట పుష్ప సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇక తాజాగా వచ్చిన ఊ అంటావా మావా సమంత స్పెషల్ సాంగ్ అయితే.. మాస్ నుండి క్లాస్ వరకు రిపీట్ వ్యూయర్స్ గా మారిపోయారు.

Anaika Soti: అందాలతో చిత్రవధ చేస్తున్న అనైకా!

సమంతా గ్లామర్ కు చంద్రబోస్ లిరిక్స్ తోడైతే మంగ్లీ చెల్లెలు చంద్రావతి హస్కి వాయిస్ పాటను మరో మెట్టు ఎక్కించేసింది. అయితే, ఈ పాట కూడా కాపీనే ట్రోల్స్ వస్తున్నాయి. స్టార్ హీరో సూర్య-తమన్నాల వీడొక్కడే సినిమా అప్పట్లో మంచి హిట్. ఇందులో హారిస్ జయరాజ్ అందించిన హానీ హానీ పాట గురించి కూడా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటలోనే మరికొందరు తమిళ సెలబ్రిటీలు కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారు. సమంతా స్పెషల్ సాంగ్ వింటుంటే హానీ పాటను కాపీ కొట్టారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అయితే, దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలపై కూడా ఈ ట్రోల్స్ చాలా కామన్ అయిపోయాయి. మరి ఇవన్నీ మేకర్స్ పట్టించుకుంటారా!