Samsung Galaxy F14 5G : 50MP కెమెరా, భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ F14 5G ఫోన్.. కేవలం రూ.12,990 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Samsung Galaxy F14 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి కొత్త శాంసంగ్ గెలాక్సీ F14 సిరీస్ ఫోన్ వచ్చేసింది. ఈ 5G ఫోన్ కేవలం రూ. 12,990 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

Samsung Galaxy F14 5G : 50MP కెమెరా, భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ F14 5G ఫోన్.. కేవలం రూ.12,990 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Samsung Galaxy F14 5G with 50MP camera launched in India, introductory price starts at Rs 12,990

Updated On : March 24, 2023 / 3:52 PM IST

Samsung Galaxy F14 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి కొత్త శాంసంగ్ గెలాక్సీ F14 సిరీస్ ఫోన్ వచ్చేసింది. ఈ 5G ఫోన్ (Samsung Galaxy F14 5G) కేవలం రూ. 12,990 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ కొత్త (Samsung) ఫోన్‌ 2023లో దేశంలో అత్యంత సరసమైన 5G-రెడీ డివైజ్‌లలో ఒకటిగా ఉంది. Galaxy F14 5G కీలక ఫీచర్లలో 6,000mAh బ్యాటరీ, 90Hz 6.6-అంగుళాల డిస్‌ప్లే, 128GB స్టోరేజీ కలిగి ఉంటాయి. ఈ కొత్త ఫోన్ గత ఏడాదిలో Galaxy F13కు అప్‌గ్రేడ్ వెర్షన్. ఇందులో 6.6-అంగుళాల డిస్ప్లేతో పాటు 6,000mAh బ్యాటరీ ఉన్నాయి.

శాంసంగ్ Galaxy F14 5G ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ F14 5G ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart Sale) జాబితా ప్రకారం.. భారత మార్కెట్లో (4GB RAM, 128GB స్టోరేజీ) రూ. 14,490 ఉండగా, (6GB RAM +128GB స్టోరేజీ) రూ. 15,990లకు అందుబాటులో ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో రూ. 1,500 విలువైన ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

Read Also : Samsung Galaxy S23 Sale in India : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లపై సేల్.. ఏ ఫోన్ ధర ఎంతంటే? బ్యాంకు డిస్కౌంట్లు కూడా..!

దాంతో వరుసగా రూ.12,990, రూ.14,490లకు సొంతం చేసుకోవచ్చు. రెండు స్టోరేజీ ఆప్షన్లు OMG బ్లాక్, GOAT గ్రీన్ BAE పర్పుల్ కలర్ ఆప్షన్‌లతో వస్తాయి. Galaxy F14 5G ఫోన్ సేల్ మార్చి 30న మధ్యాహ్నం (Flipkart), (Samsung.com) ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా సేల్ ప్రారంభం కానుంది.

Samsung Galaxy F14 5G with 50MP camera launched in India, introductory price starts at Rs 12,990

Samsung Galaxy F14 5G with 50MP camera launched in India, introductory price

శాంసంగ్ గెలాక్సీ F14 5G డిజైన్, స్పెసిఫికేషన్స్ :
కొత్త Galaxy F14 5G ఫోన్ Galaxy F13 మాదిరిగానే కనిపిస్తుంది. కొత్త ఫోన్‌లో రౌండ్ కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి. Galaxy F13లోని వెనుక కెమెరా సెన్సార్‌లు దీర్ఘచతురస్రాకార డెక్‌లో ఉన్నాయి. సెల్ఫీ కెమెరాకు ముందు ప్యానెల్ ఇప్పటికీ వాటర్‌డ్రాప్-శైలి నాచ్‌ని కలిగి ఉంది. Galaxy F14 90Hz రిఫ్రెష్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉంది. 6.6-అంగుళాల Full HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.

చాలా ఫోన్‌లలో థర్డ్-జెన్ ప్రొటెక్టివ్ గ్లాస్ ఉన్నందున ఈ రేంజ్‌లో 5వ జనరేషన్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అందిస్తోంది. శాంసంగ్ రెండు ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను అందించనుంది. Galaxy F14 5G ఆండ్రాయిడ్ 13-ఆధారిత One UI 5తో రన్ అవుతుంది. Galaxy F14 5G ఫోన్ ఫైనాన్షియల్ అప్లికేషన్‌లు, పర్సనల్ IDలు, ఇతర సీక్రెట్ డాక్యుమెంట్లను స్టోర్ చేయడానికి ఆల్-ఇన్-వన్ అప్లికేషన్‌ను అందిస్తోంది. అందులో వాయిస్ ఫోకస్ ఫీచర్, Samsung Walletకి కూడా సపోర్టు ఇస్తుంది.

ఫోన్ వెనుకవైపు, Galaxy F14 5Gలో 50-MP ప్రైమరీ వైడ్ కెమెరా, 2-MP సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 13MP కెమెరా ఉంది. ఇతర ముఖ్య ఫీచర్లలో 25W ఛార్జింగ్, Exynos 1330 SoC, 13-బ్యాండ్ 5G సపోర్టుతో కూడిన 6000mAh బ్యాటరీ ఉన్నాయి. (Samsung) ప్యాకేజీ పవర్ అడాప్టర్‌ని కలిగి ఉండదని కస్టమర్‌లు గమనించాలి. USB-C పోర్ట్‌తో శాంసంగ్ ప్రత్యేక 25W ఛార్జర్ ధర రూ. 1,149 వరకు ఉంటుంది. కానీ, మీరు థర్డ్-పార్టీ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.

Read Also : Samsung Galaxy F14 5G : మార్చి 24న శాంసంగ్ గెలాక్సీ F14 5G వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే స్పెషిఫికేషన్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?