Yash : ‘కేజీఎఫ్ 2’ సినిమా మధ్యలో సంజయ్ దత్‌కి లంగ్ క్యాన్సర్..

సంజయ్ దత్ ఈ సినిమాలో అధీరా పాత్రలో కనిపించనున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో యశ్ మాట్లాడుతూ సంజయ్ దత్ గురించి పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు. హీరో యశ్ మాట్లాడుతూ..........

Yash : ‘కేజీఎఫ్ 2’ సినిమా మధ్యలో సంజయ్ దత్‌కి లంగ్ క్యాన్సర్..

Sanjay

 

Sanjay Dutt :  యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 2018లో వచ్చిన కన్నడ సినిమా ‘కేజీఎఫ్’ పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అప్పట్నుంచి ‘కేజీఎఫ్ 2’ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ‘కేజీఎఫ్ 2’ని ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా దీనికి ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు చిత్ర యూనిట్. నిన్న మార్చ్ 27 రాత్రి ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ట్రైలర్ ని విడుదల చేశారు. అలాగే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగుళూర్ లో ఘనంగా జరిగింది.

ఈ ట్రైలర్ లాంచ్ ని బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేయడం విశేషం. కన్నడలో ఈ సినిమా ట్రైలర్ ని శివరాజ్ కుమార్ విడుదల చేశారు. తమిళ్ లో సూర్య, తెలుగులో రామ్ చరణ్, మలయాళంలో పృద్విరాజ్ సుకుమారన్, హిందీలో ఫర్హాన్ అక్తర్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సంజయ్ దత్, రవీనా టాండన్, మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్, తెలుగు నిర్మాత సాయి కొర్రపాటితో పాటు చిత్ర యూనిట్, పలువురు అభిమానులు పాల్గొన్నారు.

Oscar Awards : 94వ ఆస్కార్ విజేతలు వీరే.. ఘనంగా ఆస్కార్ అవార్డుల ప్రధానం..

సంజయ్ దత్ ఈ సినిమాలో అధీరా పాత్రలో కనిపించనున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో యశ్ మాట్లాడుతూ సంజయ్ దత్ గురించి పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు. హీరో యశ్ మాట్లాడుతూ.. ”కేజీఎఫ్ 2 షూటింగ్ మొదలయ్యాక కొన్ని రోజులకు సంజయ్‌దత్‌ లంగ్‌ క్యాన్సర్‌తో ట్రీట్‌మెంట్‌కు వెళ్లారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరం ప్రార్థించాము. ఆయన దాన్నుంచి కోలుకొని మళ్ళీ అదే ఉత్సాహంతో సెట్‌లో చేరి కమిట్‌మెంట్‌తో పని చేశారు. పనిపట్ల ఆయనకున్న నిబద్ధతే ఆయన్ని ఆ స్థాయిలో ఉంచింది. సంజయ్ దత్‌తో యాక్షన్‌ సీక్వెన్స్‌ చేసేటప్పుడు మాలో ఓ రకమైన భయం ఉండేది. ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండమని సెట్‌లో అందరికీ చెబుతుంటే అది ఆయన అవమానంగా భావించేవారు. ఓ రోజు నన్ను దగ్గరికి పిలిచి యశ్‌ భాయ్‌ నువ్వు నన్ను అలా అవమానించకు. నువ్వు నా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నావని నాకు తెలుసు. కానీ నేను యాక్ట్‌ చేస్తాను, చేయగలను. ది బెస్ట్‌ ఇస్తాను అని అన్నారు, అలాగే ఇచ్చారు కూడా” అని తెలిపారు.