Jamuna : సినిమాలోకి రాకముందే సావిత్రి, జమునల స్నేహం..

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి జమున కన్ను మూసింది. మహానటి సావిత్రితో కలిసి జమున అనేక చిత్రాల్లో నటించింది. ఇక ఇండస్ట్రీలో వీరిద్దరి స్నేహం గురించి అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరి స్నేహం సినిమా రంగంలోకి వచ్చిన తరువాత ఏర్పడింది కాదు.

Jamuna : సినిమాలోకి రాకముందే సావిత్రి, జమునల స్నేహం..

savitri jamuna

Jamuna : టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా అలనాటి తారలు అంతా స్వర్గస్తులు అవుతూ వస్తున్నారు. తాజాగా సీనియర్ నటి జమున కన్ను మూసింది. ఆమె హఠాన్మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర తారలతో నటించిన జమున వెండితెర సత్యభామగా పేరు సంపాదించుకుంది. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి అలరించింది. మహానటి సావిత్రితో కలిసి జమున అనేక చిత్రాల్లో నటించింది.

Jamuna Issue with NTR & ANR : జమునని బాయ్‌కాట్ చేసిన ఎన్టీఆర్, ఏఎన్నార్.. సారీ చెప్పమంటే తగ్గేదేలే అన్న జమున..

ఇక ఇండస్ట్రీలో వీరిద్దరి స్నేహం గురించి అందరికి తెలిసిందే. సినిమాల్లో అక్క చెల్లిలా కనిపించే వీరిద్దరూ బయట కూడా అలాంటి బంధానే మెయిన్‌టైన్ చేస్తూ వచ్చేవారు. అయితే వీరిద్దరి స్నేహం సినిమా రంగంలోకి వచ్చిన తరువాత ఏర్పడింది కాదు. సావిత్రి, జమునల స్నేహం సినిమాలోకి రాకముందే ఏర్పడింది. సావిత్రి నాటకాలు వేసే సమయంలో జమునతో స్నేహం ఏర్పడింది. కర్ణాటకలోని హంపిలో పుట్టిన జమున గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పెరిగింది. ఆ సమయంలోనే మొదటిసారిగా దుగ్గిరాలలో సావిత్రి, జమునల పరిచయం ఏర్పడింది.

నాటక ప్రదర్శన ఇచ్చేందుకు అనుకోకుండా ఒకసారి సావిత్రి దుగ్గిరాల చేరుకుంది. ఆ సమయంలో సావిత్రి జమున ఇంటిలోనే బస చేసింది. అలా వారిద్దరికీ సినిమాలోకి రాకముందే పరిచయం ఏర్పడింది. అప్పటినుంచే సావిత్రిని ‘అక్కా’ అని పిలుస్తూ వచ్చేది జమున. ఇక ఆ పరిచయ సమయంలో జమున మాటల్లో నటన పై ఆసక్తి గమనించిన సావిత్రి.. సినిమాలోకి రమ్మని స్వయంగా ఆహ్వానించింది. సినిమాపై మక్కువ ఉన్న జమునకి సావిత్రి మాటలు మరెంత ఆసక్తిని రేకితించింది. ఇక సావిత్రి ఇచ్చిన స్ఫూర్తితో నాటకాల్లో నటించడం మొదలుపెట్టింది జమున.

ప్రఖ్యాత నటులు జగ్గయ్య వీరిద్దరికీ నాటకాల్లో అవకాశాలు కల్పిస్తూ, వాటికి దర్శకత్వం వహించేవారు. అలా నాటకాల్లో ఆమె నటన చూసి సినిమా అవకాశం చేరి వచ్చింది. కానీ మొదటి సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత డాక్టర్ గరికపాటి రాజారావు తెరకెక్కించిన ‘పుట్టిల్లు’ చిత్రం ద్వారా జమున చిత్రసీమకు పరిచయం అయ్యింది. ఆ సినిమా హిట్టు కాకపోయినా జమున నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినీరంగ ప్రవేశం చేసినప్పుడు జమున వయసు కేవలం 14 ఏళ్ళు. ఇక అలా మొదలైన జమున సినీ కెరీర్ సావిత్రితో కలిసి స్వర్ణయుగం చూసింది.