Jamuna Issue with NTR & ANR : జమునని బాయ్‌కాట్ చేసిన ఎన్టీఆర్, ఏఎన్నార్.. సారీ చెప్పమంటే తగ్గేదేలే అన్న జమున..

జమునని ఒకానొక సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ బాయ్ కాట్ చేశారు. జమున స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత కొన్ని కారణాలతో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ జమునతో నటించమని అధికారికంగా ప్రకటించారు. దీంతో............

Jamuna Issue with NTR & ANR : జమునని బాయ్‌కాట్ చేసిన ఎన్టీఆర్, ఏఎన్నార్.. సారీ చెప్పమంటే తగ్గేదేలే అన్న జమున..

NTR and ANR Boycott Jamuna for Four Years

Updated On : January 27, 2023 / 11:29 AM IST

Jamuna Issue with NTR & ANR : టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతి రావు.. లాంటి స్టార్లు, మరికొంతమంది సినీ ప్రముఖులు ఇటీవల వరుసగా మరణించగా తాజాగా మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి జమున నేడు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు, హరనాథ్, జగ్గయ్య.. లాంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించారు జమున. దాదాపు 190 కి పైగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ సినిమాల్లో నటించి మెప్పించారు.

అయితే జమునని ఒకానొక సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ బాయ్ కాట్ చేశారు. జమున స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత కొన్ని కారణాలతో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ జమునతో నటించమని అధికారికంగా ప్రకటించారు. దీంతో అంతా షాక్ అయ్యారు. జమున షూటింగుకు లేటుగా వస్తుందని, పొగరబోతని, గర్వం ఎక్కువ అని, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుందని.. ఇలాంటి వాటి వల్లే జమునని బాయ్ కాట్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

Jamuna : వెండితెర సత్యభామ.. జమున సినీ ప్రస్థానం..

అయితే జమున దీనిపై స్పందించకుండా తన సినిమాలు తానూ చేసుకుంటూ వెళ్ళింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరితో చేయకపోయినా ఆ సమయంలో జగ్గయ్య, శోభన్‌బాబు, హరనాథ్‌, కృష్ణ, కృష్ణంరాజు.. లాంటి హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. దాదాపు నాలుగేళ్లు ఎన్టీఆర్, ఏఎన్నార్ జమునతో నటించలేదు. అయితే అప్పటికే గుండమ్మ కథ సినిమా ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమునలతో మొదలుపెట్టారు. కొన్ని కారణాలతో ఆ సినిమా లేట్ అవ్వగా, జమున వివాదంతో సినిమా ఆగిపోయింది. దీంతో చక్రపాణి, కె.వి.రెడ్డి ముగ్గురికి రాజీ కుదర్చడానికి చాలా ప్రయత్నించారు. సారీ చెప్పమని జమునకి చెప్తే చెప్పను, నేనేం తప్పు చేయలేదు అనడంతో ఆ గొడవ ఇంకా ముదిరింది. చివరకు నిర్మాత చక్రపాణి ముగ్గురినీ కూర్చోబెట్టి, వాళ్ళని తిట్టి, మందలించి ముగ్గురిని కలిపారట. దీంతో గుండమ్మ కథ సినిమా పట్టాలెక్కింది. ఆ తర్వాత మళ్ళీ జమున ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్ లో చాలా సినిమాలు చేసింది.