Shobana : సీనియర్ నటి శోభనకి ఒమిక్రాన్..

నటి శోభన ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ''ప్రపంచం అద్భుతంగా నిద్రపోతున్నప్పుడు నేను ఒమిక్రాన్ బారిన పడ్డాను. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు ఒమిక్రాన్...........

Shobana : సీనియర్ నటి శోభనకి ఒమిక్రాన్..

Shobana

Shobana :  ప్రస్తుతం ఒకపక్క కరోనా, మరోపక్క ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇటీవల మహేష్ బాబు, మంచు లక్ష్మి, థమన్, వరలక్ష్మి శరత్ కుమార్, సత్యరాజ్, హెబ్బా పటేల్, బండ్ల గణేష్, త్రిష, ఇషా చావ్లా … ఇలా చాలా మంది కరోనా బారిన పడుతుంటే సినీ పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలయింది. తాజాగా మరో సీనియర్ నటి శోభన ఒమిక్రాన్ కి గురయ్యింది. ఇప్పటివరకు కేవలం కరోనానే అనుకుంటే ఒమిక్రాన్ కూడా సెలబ్రిటీలను టార్గెట్ చేయడంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు.

Esha Chawla : కరోనా బారిన పడుతున్న సెలబ్రిటీలు.. మరో హీరోయిన్ ఇషాచావ్లాకి కరోనా..

నటి శోభన ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ”ప్రపంచం అద్భుతంగా నిద్రపోతున్నప్పుడు నేను ఒమిక్రాన్ బారిన పడ్డాను. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు ఒమిక్రాన్ వచ్చింది. ప్రస్తుతం నాకు కీళ్ల నొప్పులు, చలి, గొంతులో మంట, గొంతు నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది మొదటి రోజు మాత్రమే. తర్వాత ప్రతిరోజూ నా లక్షణాలు తగ్గుతాయి అని ఆశిస్తున్నాను. నేను రెండు డోసుల వ్యాక్సిన్స్ ని వేయించుకున్నాను. అందుకు నేను సంతోషిస్తున్నాను, ఎందుకంటే వ్యాక్సిన్స్ వ్యాధిని 85 శాతం అభివృద్ధి చేయకుండా నిరోధిస్తుందని నేను నమ్ముతున్నాను. మీరు ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకోకపోతే వేయించుకోండి. ఈ కరోనా మహమ్మారి త్వరగా ముగింపు అవ్వాలని నేను ఆశిస్తున్నాను మరియు ప్రార్థిస్తున్నాను” అని పోస్ట్ చేసింది.