Actress Suhasini : హిందీ భాషా వివాదం..సీనియర్ నటి సుహాసిని సంచలన వ్యాఖ్యలు

తమిళం వాళ్లు కూడా మంచివాళ్లే.. అయితే హిందీ వాళ్లు కూడా తమిళంలో మాట్లాడితే సంతోషమన్నారు. తన ఇంట్లో పని చేసే వారిలో తెలుగు, హిందీ మాట్లాడేవారున్నారని తెలిపారు.

Actress Suhasini : హిందీ భాషా వివాదం..సీనియర్ నటి సుహాసిని సంచలన వ్యాఖ్యలు

Suhasini

Senior actress Suhasini : దేశవ్యాప్తంగా హిందీ భాషా వివాదం ముదురుతోంది. కిచ్చా సుదీప్, అజయ్ దేవగణ్ మధ్య హిందీ భాషా వివాదం మొదలైంది. తాజాగా హిందీ భాషా వివాదంపై సీనియర్ నటి సుహాసిని స్పందించారు. నటులు అన్న తర్వాత అన్ని భాషలు నేర్చుకోవాలన్నారు. హిందీ మంచి లాంగ్వేజ్.. అది కూడా నేర్చుకోవాలని సూచించారు. హిందీ మాట్లాడే వాళ్ళు మంచి వాళ్లే.. వాళ్లతో మాట్లాడాలంటే హిందీ నేర్చుకోవాల్సిందేనని అన్నారు.

తమిళం వాళ్లు కూడా మంచివాళ్లే.. అయితే హిందీ వాళ్లు కూడా తమిళంలో మాట్లాడితే సంతోషమన్నారు. తన ఇంట్లో పని చేసే వారిలో తెలుగు, హిందీ మాట్లాడేవారున్నారని తెలిపారు. ఆ భాషే కావాలి.. ఈ భాషే కావాలంటే తిండి దొరకదన్నారు. అందుకే అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలని సూచించారు.

RGV : ముదురుతున్న లాంగ్వేజ్ వార్.. బాలీవుడ్‌కి ఛాలెంజ్ చేస్తూ మధ్యలో దూరిన ఆర్జీవీ..

సుహాసిని వ్యాఖ్యలపై తమిళ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందీ భాష నేర్చుకోవాలన్న సుహాసిని వ్యాఖ్యలను తమిళ యువత తప్పుపడుతోంది. సోషల్ మీడియా వేదికగా సుహాసినిపై ట్రోలింగ్ చేస్తున్నారు. హిందీ భాష మాట్లాడాలని అనిపిస్తే సుహాసిని హిందీ సినిమాలే చేసుకుంటూ బాలీవుడ్‌లోనే ఉండాల్సిందంటూ సెటైర్లు వేస్తున్నారు.