Jersey: సౌత్ సినిమాల దెబ్బకు బ్యాక్‌స్టెప్ వేసిన బాలీవుడ్!

ఇటీవల బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండస్ట్రీ అన్నట్లుగా సినిమాలు పోటీపడుతుండటంతో ఇండియన్ బాక్సాఫీస్ రెండు వర్గాలుగా చీలిపోయిందని సినీ విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు....

Jersey: సౌత్ సినిమాల దెబ్బకు బ్యాక్‌స్టెప్ వేసిన బాలీవుడ్!

Shahid Kapoor Jersey Movie Release Postponed

Jersey: ఇటీవల బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండస్ట్రీ అన్నట్లుగా సినిమాలు పోటీపడుతుండటంతో ఇండియన్ బాక్సాఫీస్ రెండు వర్గాలుగా చీలిపోయిందని సినీ విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం చేసిన కామెంట్స్ దీనికి ఉదాహరణగా నిలిచాయని వారు అంటున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోని సినిమా లవర్స్ మాత్రం మంచి సినిమా వస్తే తాము తప్పకుండా ఆదరిస్తామని చెబుతున్నారు. ఇక ఈ వారంలో బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ చిత్రాల మధ్య గట్టి వార్ జరగబోతుంది. ఇప్పటికే దక్షిణాది నుండి తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న బీస్ట్ ఏప్రిల్ 13న, కన్నడ హీరో యశ్ నటిస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14న రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అయితే బాలీవుడ్‌లోనూ ఎంతోకాలంగా హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న జెర్సీ చిత్రాన్ని ఏప్రిల్ 14న రిలీజ్‌కు రెడీ చేశారు.

KGF2: బాహుబలి2 రికార్డులు బ్రేక్.. హీరో గట్టిగానే ఇచ్చాడుగా!

అయితే బీస్ట్ చిత్రాన్ని పక్కనబెడితే, బాలీవుడ్‌లో కేజీఎఫ్ చిత్రానికి ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం ఇక్కడ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, ఇప్పుడు అదే పేరుతో ఈ సినిమాను బాలీవుడ్‌లోనూ రెడీ చేశాడు. ఇక ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 14న రిలీజ్‌కు రెడీ అయ్యింది. కానీ అదే రోజున కేజీఎఫ్ చాప్టర్ 2 భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుండటంతో ఇప్పుడు ‘జెర్సీ’ చిత్రాన్ని మరోసారి వాయిదా వేశారు చిత్ర యూనిట్.

Jersey Movie : షాహిద్ కపూర్ ‘జెర్సీ’ విడుదల వాయిదా..

కేజీఎఫ్ 2 చిత్రానికి అదిరిపోయే క్రేజ్ నెలకొనడంతో, ఈ సినిమా బాలీవుడ్‌లోనూ తుఫాన్ క్రియేట్ చేయడం ఖాయమని అక్కడి సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఒకవేళ జెర్సీ చిత్రాన్ని పంతానికి పోయి అదే రోజున రిలీజ్ చేస్తే.. కేజీఎఫ్ తుఫాన్‌లో అది కొ్ట్టుకుపోవడం ఖాయమని వారు అంటున్నారు. దీంతో చేసేదేమీ లేక జెర్సీ మేకర్స్ తమ సినిమాను ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 22కు వాయిదా వేశారు. ఈ సినిమా నిర్మాతలైన అల్లు అరవింద్, నాగవంశీ, బన్నీ వాస్‌లు జెర్సీ రిలీజ్ విషయంలో తెలివిగా వ్యవహరించారని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సౌత్ ప్రభంజనం ముందు బాలీవుడ్ బ్యాక్‌స్టెప్ వేయడంతో ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది బీటౌన్‌గా మారింది.