KGF2: బాహుబలి2 రికార్డులు బ్రేక్.. హీరో గట్టిగానే ఇచ్చాడుగా!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాల హవా జోరుగా కొనసాగుతోంది. బాహుబలి సిరీస్ తరువాత ఈ జోనర్ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగిందని చెప్పాలి.....

KGF2: బాహుబలి2 రికార్డులు బ్రేక్.. హీరో గట్టిగానే ఇచ్చాడుగా!

Yash About Kgf2 Breaking Baahubali 2 Records

KGF2: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాల హవా జోరుగా కొనసాగుతోంది. బాహుబలి సిరీస్ తరువాత ఈ జోనర్ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగిందని చెప్పాలి. భారీ బడ్జెట్ చిత్రాలతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలకు అంతే భారీ వ్యయంతో ప్రమోషన్స్ నిర్వహిస్తూ తమ సినిమాలపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేస్తున్నారు ఫిలిం మేకర్స్. ఇక తాజాగా ఈ వారంలో రెండు పాన్ ఇండియా మూవీలు రిలీజ్‌కు రెడీగా ఉండటంతో దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ ఈ రెండు సినిమాల గురించే చర్చించుకుంటున్నారు.

KGF2: భారీ ఓపెనింగ్స్‌పై కన్నేసిన కేజిఎఫ్2.. బాక్స్ బద్ధలేనా?

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను మించిన అంచనాలను సొంతం చేసుకుంది కన్నడలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ డ్రామా మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. తొలి భాగం అందుకున్న అఖండమైన విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు హీరో యశ్‌‌తో కలిసి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈసారి పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగుతున్నారు. పోటీగా మరో పాన్ ఇండియా మూవీ ఉన్నప్పటికీ, తమ సినిమాలోని కథపై పూర్తి నమ్మకంతో రంగంలోకి దిగుతోంది కేజీఎఫ్ 2 చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది కేజీఎఫ్ 2 టీమ్. కాగా ఇందులో భాగంగా రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు చిత్ర యూనిట్ తాజాగా తిరుపతికి చేరుకుంది. స్వామివారిని దర్శించుకున్న చిత్ర యూనిట్, తిరుపతిలో ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఓ విలేకరి హీరో యశ్‌ను ‘కేజీఎఫ్ చిత్రం బాహుబలి 2 చిత్ర కలెక్షన్లను బ్రేక్ చేస్తుందా’ అని అడిగారు.

KGF2: ఆర్ఆర్ఆర్‌ను క్రాస్ చేసిన కేజీఎఫ్2..?

దీనికి సమాధానంగా యశ్ మాట్లాడుతూ.. ఒక సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయితే.. అది దానికంటే ముందు వచ్చిన సినిమాల రికార్డులను బ్రేక్ చేయాలి.. అప్పుడే ప్రోగ్రెస్ అంటారు. అంతేగానీ ఒక సినిమా రికార్డును క్రియేట్ చేసిందని.. దాన్నే పట్టుకుని కూర్చొవద్దని.. కలెక్షన్లు, వసూళ్ల లెక్కలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.. సినిమాపై ప్రేక్షకులకు ఎంత ప్రేమ ఉందనేది ముఖ్యం.. భగవంతుడు ఏం డిసైడ్ చేస్తే అదే జరుగుతుంది..’’ అంటూ యశ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు సదరు విలేకరికి.

ఇక శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కేజీఎఫ్ 2 చిత్రంలో సంజయ్ దత్, రవీనా టండన్, తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హొంబాలే ఫిలింస్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.