Tiger 3 : షారుఖ్-సల్మాన్ మధ్య ఒక్క ఫైట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా? మీడియం హీరో సినిమా తీసేయొచ్చు..

టైగర్ 3 కోసం అన్ని రకాల కసరత్తులు చేస్తున్నారు సల్మాన్. సినిమాని ఎట్టి పరిస్తితుల్లో సక్సెస్ చెయ్యడానికి సినిమా రేంజ్ ని పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

Tiger 3 : షారుఖ్-సల్మాన్ మధ్య ఒక్క ఫైట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా? మీడియం హీరో సినిమా తీసేయొచ్చు..

Shahrukh Khan and Salman Khan fight cost worth morethan 30 crores in Tiger 3

Shahrukh – Salman : పఠాన్(Pathan) లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న స్పై మూవీ సల్మాన్ ఖాన్ క్రేజీ ప్రాజెక్ట్.. టైగర్ 3(Tiger 3) రోజు రోజుకీ హైప్స్ పెంచేస్తోంది. అసలే సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న సల్మాన్ టైగర్ 3తో ఎలా అయినా బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే టైగర్ 3ని అందరి అంచనాలను మించి రెడీ చేస్తున్నారు.

లేటెస్ట్ గా టైగర్ 3 భారీ యాక్షన్ షూట్ కోసం దాదాపు పాతిక కోట్లు ఖర్చు పెడుతున్నారట చిత్రయూనిట్. సెట్ కి కూడా కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. టైగర్ 3 కోసం అన్ని రకాల కసరత్తులు చేస్తున్నారు సల్మాన్. సినిమాని ఎట్టి పరిస్తితుల్లో సక్సెస్ చెయ్యడానికి సినిమా రేంజ్ ని పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబందించి లేటెస్ట్ గా మడ్ ఐలాండ్ లో 25 కోట్లతో సెట్ రెడీ చేసి యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నారు.

యశ్ రాజ్ స్పై ఫిలిమ్స్ లో భాగంగా టైగర్ 3లో షారుఖ్ కనిపించబోతున్నట్టు తెలిసిందే. దీంతో ఈ 25 కోట్లతోనే షారూఖ్ , సల్మాన్ మధ్య టైగర్ 3 కోసం భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించబోతున్నారు. పఠాన్ లో క్యామియో రోల్ ప్లే చేశారు సల్మాన్. ఆ సీక్వెన్స్ బాగా క్లిక్ అయింది. ఇప్పుడు టైగర్ 3 లో షారూఖ్ కూడా మాంచి యాక్షన్ సీన్స్ లో కలిసి ఆడియన్స్ కి యాక్షన్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు యాక్షన్ చేస్తే అది ఓ రేంజ్ లో ఉండాల్సిందే. అదీ కాక పఠాన్ క్రియేట్ చేసిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు. యాక్షన్ స్టంట్స్ తో అదరగొట్టిన పఠాన్ ని బీట్ చెయ్యాలన్నా, ఆ రేంజ్ కలెక్షన్లు రాబట్టాలన్నా, సల్మాన్ మళ్ళీ హిట్ కొట్టాలన్నా గ్యారంటీ గా నెక్ట్స్ లెవల్ మేకింగ్ ఉండాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.

Balakrishna : చిరు దర్శకుడితో బాలయ్య సినిమా.. నిజమేనా?

అయితే మరీ ఒక్క ఫైట్ కోసమే 25 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే మరీ ఎక్కువ అంటున్నారు కొంతమంది. ఇది కేవలం మేకింగ్, సెట్, యాక్షన్ అరేంజ్మెంట్స్ కి మాత్రమే అని సమాచారం. మళ్ళీ ఫైటర్స్ రెమ్యునరేషన్స్, టెక్నీషియన్స్.. ఇవన్నీ ఎలాగో ఎక్కువే. అవి కూడా కలుపుకుంటే 30 కోట్లకు పైనే అవుతున్నట్టు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అంత బడ్జెట్ ఉంటే టాలీవుడ్ లో ఓ మీడియం హీరో మంచి సినిమా తీసేస్తాడు అంటున్నారు నెటిజన్లు. మరి అంత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న టైగర్ 3 ఏ రేంజ్ హిట్ కొడుతుందో చూడాలి.