Shankar: ఇండియన్-2.. స్పీడ్ పెంచేస్తానంటోన్న శంకర్!

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, స్టార్ హీరో కమల్ హాసన్‌తో కలిసి ‘ఇండియన్-2’ అనే సినిమాను గతంలోనే ప్రారంభించాడు. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ రావడం.. చిత్ర యూనిట్‌లో విభేదాలు రావడంతో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి స్టార్ట్ చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు.

Shankar: ఇండియన్-2.. స్పీడ్ పెంచేస్తానంటోన్న శంకర్!

Shankar To Speed Up For Indian 2

Shankar: తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా.. తెలుగు, తమిళంలో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Shankar: శంకర్-చరణ్ సినిమాకు నో చెప్పిన స్టార్ హీరో.. ఎవరంటే?

శంకర్ ఈ సినిమాను తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా పూర్తి పొలిటికల్ థ్రిల్లర్ చిత్రంగా రానుందట. అయితే ఈ సినిమాను త్వరగా ముగించేశాక, శంకర్ తన ప్రెస్టీజియస్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని చూస్తున్నాడట. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్2 అనే సినిమాను గతంలోనే మొదలెట్టాడు శంకర్. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. ఇలా చాలాసార్లు వాయిదా పడటంతో ఈ సినిమా అటకెక్కిందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి.

Kamal Haasan : కమల్ హాసన్ ఆఫీస్‌కి తమిళనాడు ప్రభుత్వం నోటీసులు..

అటు కమల్ హాసన్ కూడా ఇండియన్ 2 సినిమాను పక్కనబెట్టి ‘విక్రమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ ఇండియన్2 సినిమాపై కమల్, శంకర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను అతి త్వరలో తిరిగి పట్టాలెక్కించాలని వారు ప్లాన్ చేస్తున్నారు. చరణ్‌తో సినిమాను డిసెంబర్ నాటికి ముగించేశాక, శంకర్ ఇండియన్ 2 సినిమాతో మళ్లీ బిజీ కానున్నాడట. అయితే ఈసారి ఎలాంటి అవాంతరాలు వచ్చినా, ఇండియన్ 2 సినిమాను మాత్రం ఆపేది లేదని శంకర్ అండ్ టీమ్ ఫిక్స్ అయినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఇండియన్2 కోసం శంకర్ ఎంతమేర స్పీడు పెంచుతాడో చూడాలి.