Shashi Tharoor: శశి థరూర్‌కు కాంగ్రెస్ షాక్.. గుజరాత్ ప్రచారకర్తల జాబితాలో దక్కని చోటు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయిన శశి థరూర్‌కు ఆ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. గుజరాత్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రచారకర్తల జాబితాలో ఆయనకు చోటు కల్పించలేదు.

Shashi Tharoor: శశి థరూర్‌కు కాంగ్రెస్ షాక్.. గుజరాత్ ప్రచారకర్తల జాబితాలో దక్కని చోటు

Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్‌కు ఆ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. గుజరాత్ ఎన్నికల ప్రచారకర్తల జాబితాలో ఆయనకు చోటు కల్పించలేదు. గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.

Man Kills Girlfriend: ప్రియురాలి గొంతు కోసి చంపి.. మృతదేహంతో వీడియో పోస్ట్ చేసిన నిందితుడు

డిసెంబర్ 1,5 తేదీల్లో, రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 8న ఫలితాలు వెలువడుతాయి. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలున్నాయి. గుజరాత్ ఎన్నికల్లో ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 40 మందితో జాబితా రూపొందించింది. ఈ జాబితాలో శశి థరూర్‌కు చోటు కల్పించలేదు. స్టార్ క్యాంపెయినర్లుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బాఘెల్, ప్రియాంకా గాంధీ, దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ వంటి నేతలకు చోటు కల్పించారు. తన పేరు జాబితాలో చేర్చకపోవడంపై శశి థరూర్‌ను మీడియా ప్రశ్నించింది. దీనిపై శశి థరూర్‌ స్పందిస్తూ.. ‘‘ఇలాంటి అంశాల్లో ఏది మంచో… ఎవరు కావాలో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. అలాంటప్పుడు నా పేరు లేదనే అసంతృప్తికి చోటు ఎక్కడుంటుంది’’ అన్నారు.

Cheapest Electric Car: దేశంలో చవకైన ఎలక్ట్రిక్ కారు విడుదల.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు.. ధర ఎంతంటే

గతంలో లోక్‌సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో శశి థరూర్‌ ప్రచారం చేశారు. అయితే, ఈసారి మాత్రం ఆయనకు స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో చోటు దక్కలేదు. మరోవైపు ఈ జాబితాలో చోటు లేకున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్‌యూఐ తరఫున నిర్వహించే ఒక ప్రచార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. తనకు ప్రచారకర్తల జాబితాలో చోటు దక్కని కారణంగా ఈ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. శశి థరూర్ ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి, మల్లికార్జున ఖర్గే చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.