Metas Layoff: తెల్లారేలోపే ఉద్యోగాలు తీసేసిన ‘మెటా’.. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

ఫేస్‌బుక్ మాతృసంస్థ ‘మెటా’ భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగిస్తోంది. దీనిపై ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన పంచుకుంటున్నారు. తాజాగా అన్నేకా పటేల్ అనే మహిళ ఈ అంశంపై చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Metas Layoff: తెల్లారేలోపే ఉద్యోగాలు తీసేసిన ‘మెటా’.. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

Metas Layoff: ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన ‘మెటా’ తన గ్రూపు కంపెనీలకు చెందిన ఉద్యోగుల్ని భారీ స్థాయిలో తొలగిస్తోంది. తాజాగా ఈ సంస్థ 11 వేల మందిని తొలగించింది. ‘మెటా’ ఆధ్వర్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ వంటి సంస్థలు ఉన్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan: నేడు విశాఖలో ప్రధానితో పవన్ భేటీ.. ఏపీ రాజకీయాలపై చర్చ.. సాయంత్రం విశాఖకు పవన్

ఈ కంపెనీలన్నింటికీ చెందిన ఉద్యోగుల్ని తొలగిస్తూ వస్తోంది. 2004లో ‘ఫేస్‌బుక్’ సంస్థ ప్రారంభమైంది. తర్వాత ఇది మెటా కంపెనీగా మారింది. అయితే, ఇన్నేళ్లలో ఈ స్థాయిలో ఉద్యోగుల్ని తీసేయడం ఇదే మొదటిసారి. దీనిపై కంపెనీ ఉద్యోగుల్లో చాలా మంది ఆవేదనతో స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ భావాల్ని పంచుకుంటున్నారు. అన్నేకా పటేల్ అనే మహిళ ఈ అంశంపై చేసిన పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆమె లింక్‌డ్ఇన్ వేదికగా తన ఉద్యోగం పోవడంపై స్పందించారు.

Afghanistan: పార్కులు, జిమ్‌లలోకి మహిళలకు నో ఎంట్రీ.. అఫ్గనిస్తాన్‌లో కొత్త రూల్

అన్నేకా పోస్ట్ ప్రకారం.. ‘‘వేకువఝామున మూడు గంటలకు నా మూడు నెలల వయసున్న కూతురు ఎమిలాకు పాలు పట్టేందుకు నిద్ర లేచాను. ఆ సమయంలో నా మెయిల్ చెక్ చేసుకున్నా. జుకర్ బర్గ్ ఉద్యోగాలు తొలగిస్తున్నాడని తెలిసి.. నాకు కూడా దానికి సంబంధించిన మెయిల్ వచ్చిందేమోనని చూశా. కానీ, అలాంటిదేమీ లేదు. అయితే ఎలాంటి వారిని ఉద్యోగంలోంచి తొలగిస్తున్నారు.. ఎందుకు తొలగిస్తున్నారో ఎవరికీ తెలియదు. తర్వాత నాలుగు గంటలకు ఎమిలాకు మళ్లీ పాలు పట్టాను. అప్పుడు నా మేనేజర్ నుంచి మెసేజ్ వచ్చింది. తనను ఉద్యోగంలోంచి తొలగించారని. తర్వాత నా మెయిల్స్ కూడా చెక్ చేసుకున్నాను. నా కొలీగ్స్‌తో మాట్లాడుతున్నాను. ఉదయం ఏడు గంటల వరకు అలాంటి ఈ మెయిల్స్ వస్తాయని చెప్పారు. అందరిలోనూ ఎవరి ఉద్యోగాలు ఉంటాయో.. ఎవరి ఉద్యోగం పోతుందేమో అని ఒకటే ఉత్కంఠ.

Giant Anaconda: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. అనకొండ ఎలా దాడి చేసిందో చూడండి

అయితే, ఐదున్నర గంటల సమయంలో నాకూ మెయిల్ వచ్చింది. నన్ను కూడా ఉద్యోగంలోంచి తొలగించారని. దీంతో నా గుండె బరువెక్కింది. నిజానికి నేను ప్రస్తుతం మెటర్నిటీ లీవులో ఉన్నాను. ఫిబ్రవరిలో లీవ్ ముగుస్తుంది. అయితే, ఈ సమయాన్ని నా పాప కోసం కేటాయిస్తా. ఆ తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తా. నాకు తగిన ఉద్యోగం ఉంటే రిఫర్ చేయండి’’ అంటూ అన్నేకా పోస్టు చేసింది. ‘మెటా’ సంస్థ గత రెండేళ్లలో భారీ స్థాయిలో సిబ్బందిని రిక్రూట్ చేసుకుంది. మొత్తం 90,000 మంది వరకు ఈ సంస్థకు ఉద్యోగులు ఉండేవాళ్లు. ఇప్పుడు వీరిలోంచి 11 వేల మందిని తొలగించింది. భవిష్యత్తులో ఇంకొందరిని కూడా తొలగించే అవకాశం ఉంది.