Giant Anaconda: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. అనకొండ ఎలా దాడి చేసిందో చూడండి

పాముల్లో అత్యంత పెద్దగా పెరగగలిగేవి గ్రీన్ అనకొండలు. తాజాగా ఒక గ్రీన్ అనకొండ ఒక వ్యక్తిపై దాడి చేయబోయింది. తనను పెంచుతున్న వ్యక్తిపై దాడికి ప్రయత్నించింది. అతడి చేతిని కరిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Giant Anaconda: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. అనకొండ ఎలా దాడి చేసిందో చూడండి

Giant Anaconda: అనకొండలు చాలా ప్రమాదకరమైనవి. అవి ఏ జీవినైనా చంపగలవు. జంతువులను చుట్టుకుని, గట్టిగా నొక్కి, ఊపిరాడకుండా, ఎముకలు విరిగేలా చేసి ప్రాణాలు తీస్తాయి. ఇది వాటి సహజ స్వభావం. అయితే, చిన్న అనకొండలు మనుషులకు అంత ప్రమాదకరం కాదు.

Pawan Kalyan: నేడు విశాఖలో ప్రధానితో పవన్ భేటీ.. ఏపీ రాజకీయాలపై చర్చ.. సాయంత్రం విశాఖకు పవన్

పైగా వాటిని పెంచుకుంటే అవి, మనుషులతో అలవాటుపడి పెద్దగా హాని చేయవు. అలాగని వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. ఒక్కోసారి అవి ఎవరిపైనైనా దాడి చేస్తాయి. కావాలంటే ఈ వీడియో చూడండి. తనను పట్టుకున్న వ్యక్తిపై ఒక అనకొండ ఎలా దాడి చేస్తుందో! దక్షిణ అమెరికాలో కనిపించే గ్రీన్ అనకొండలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి అత్యంత పెద్ద, విష రహిత పాములు. 30 అడుగుల పొడవు, 250 కిలోల బరువు వరకు పెరగగలవు. తాజాగా నిక్ అనే ఒక వ్యక్తి గ్రీన్ అనకొండను పెంచుకుంటున్నాడు. అతడు ఆ అనకొండను చేతిలోకి తీసుకోగా, అది అతడి చేతిని చుట్టుకుని, దాడికి ప్రయత్నించింది. నోరు తెరిచి అతడ్ని కరిచేందుకు ప్రయత్నించింది.

Afghanistan: పార్కులు, జిమ్‌లలోకి మహిళలకు నో ఎంట్రీ.. అఫ్గనిస్తాన్‌లో కొత్త రూల్

ముందుగా అతడి టీ షర్ట్‌పై కరవబోయింది. ఆ తర్వాత అతడి చేతిని కరిచింది. దీన్ని అతడి సిబ్బంది వీడియో తీశారు. తర్వాత అతడు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూస్తే పాములంటే భయం పుట్టడం ఖాయం. కావాలంటే మీరూ చూడండి.