Raj Kundra : భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి స్పందించిన శిల్పా శెట్టి.. రిమాండ్ పొడిగించిన పోలీసులు..

భర్త అరెస్ట్ తర్వాత శిల్పా శెట్టి ఫస్ట్ టైం సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయింది..

Raj Kundra : భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి స్పందించిన శిల్పా శెట్టి.. రిమాండ్ పొడిగించిన పోలీసులు..

Raj Kundra

Updated On : July 23, 2021 / 4:16 PM IST

Raj Kundra: శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్‌‌ను టార్గెట్‌గా చేసుకుని, డబ్బు ఆశ చూపిస్తూ వారిని పోర్న్ వీడియోల్లో నటించమని ఒత్తిడి చేస్తున్నట్లు నిరూపితమవడంతో రాజ్ కుంద్రాతో పాటు మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే భర్త అరెస్ట్ తర్వాత శిల్పా శెట్టి ఫస్ట్ టైం సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయింది.

Shilpa Shetty : భర్త వ్యవహారంతో శిల్పా శెట్టికి సెగ?

ప్రముఖ రచయిత జేమ్స్ థర్బర్ నవలలోని స్ఫూర్తివంతమైన పదాలను హైలెట్ చేస్తూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. ‘‘కోపంలో వెనక్కి తిరిగి చూడకు, భయంగా ఉన్నప్పుడు భవిష్యత్తును చూడకు. పూర్తి అవగాహనతో చుట్టుపక్కల చూడు. మనల్ని బాధపెట్టిన వారి వైపు కోపంతో వెనక్కి తిరిగి చూస్తాం. ఉద్యోగం పోతుందేమో అన్న భయంతోనో, ఏదైనా వ్యాధి బారిన పడతామనో, మనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోతామనే భయంతోనో భవిష్యత్తును చూస్తాం. అదృష్టవశాత్తు నేను ఇంకా బతికే ఉన్నానని తెలిసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను..

గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. భవిష్యత్తులో కూడా సవాళ్లను ఎదుర్కొంటా. ఏం జరిగినా నేను బతుకుతాను. దాన్ని ఏ శక్తీ ఆపలేదు’’ అంటూ శిల్పా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ముందుగా రాజ్ కుంద్రాకు జూలై 23 వరకు రిమాండ్ విధించిన కోర్ట్, అతని నుండి మరింత కీలక సమాచారం రాబట్టడానికి ముంబై పోలీసులు గడువు కోరడంతో.. మరో నాలుగు రోజుల పాటు.. జూలై 27 వరకు కస్టడీని పొగిడించింది.

Shilpa Shetty