karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

ఇక వీరితో పాటు ఎనిమిది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. జి. పరమేశ్వర్ (ఎస్సీ), కేహెచ్ మునియప్ప (ఎస్సీ), కేజే జార్జ్ (మైనార్టీ – క్రిస్టియన్), ఎంబీ పాటిల్ (లింగాయత్), సతీష్ జార్కిహోళి (ఎస్టీ – వాల్మీకి), ప్రియాంక్ ఖర్గే (ఎస్సీ), రామలింగారెడ్డి (రెడ్డి), బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ (మైనార్టీ -ముస్లీం)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు

karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

CM and DCM Oath: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆయనకు డిప్యూటీగా (ఉప ముఖ్యమంత్రి) డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని బెంగళూరలోని కంఠవీర స్టేడియంలో వీరి చేత గవర్నర్ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక వీరితో పాటు ఎనిమిది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. జి. పరమేశ్వర్ (ఎస్సీ), కేహెచ్ మునియప్ప (ఎస్సీ), కేజే జార్జ్ (మైనార్టీ – క్రిస్టియన్), ఎంబీ పాటిల్ (లింగాయత్), సతీష్ జార్కిహోళి (ఎస్టీ – వాల్మీకి), ప్రియాంక్ ఖర్గే (ఎస్సీ), రామలింగారెడ్డి (రెడ్డి), బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ (మైనార్టీ -ముస్లీం)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం.. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

India Defence Production: రక్షణ రంగంలో భారత్ సరికొత్త రికార్డ్.. తొలిసారి రూ.లక్ష కోట్లు దాటిన ఉత్పత్తి

ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. వీరితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‭గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు హాజరు అయ్యారు. వీరితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, జర్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూఖ్ అబ్దుల్లా, మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, బిహార్ డీసీఎం తేజశ్వీ యాదవ్, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ.రాజా హాజరయ్యారు.

Nara Lokesh : బావా.. జూనియర్ ఎన్టీఆర్‌కు నారా లోకేశ్ ఏమని జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడో తెలుసా..?

ఈ ప్రమాణ స్వీకారోత్సవం ద్వారా విపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. బీజేపీయేతర పార్టీల్లోన్ని కొన్ని పార్టీలకు మాత్రమే సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానాలు అందాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పలువురు ముఖ్యమంత్రులు, నేతలను ఫోన్ ద్వారా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. వీరిలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాలకు ఖర్గే ఆహ్వానాలు పంపించారు.