Simran: ‘సర్దార్’ కి విలన్‌గా సిమ్రాన్..!

‘సర్దార్’ లో సినిమాకి కీలకమైన లేడి విలన్ రోల్ సిమ్రాన్ చేస్తే బాగుంటుందని డైరెక్టర్ అప్రోచ్ అవగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే షూట్‌లో జాయిన్ అవబోతున్నారని కోలీవుడ్ మీడియా టాక్..

Simran: ‘సర్దార్’ కి విలన్‌గా సిమ్రాన్..!

Simran Playing Negative Role In Karthi Sardar Movie

Simran: ఇటీవల ‘సుల్తాన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన తమిళ యంగ్ హీరో కార్తి నటిస్తున్న న్యూ మూవీ ‘సర్దార్.. విశాల్‌తో ‘ఇరుంబి తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’), శివ కార్తికేయన్‌తో ‘హీరో’ సినిమాలతో తమిళ్, తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ డైరెక్ట్ చేస్తున్నారు.

Sardar : ‘సర్దార్’ గా కార్తి.. వీడియో చూశారా!..

ఫస్ట్ లుక్‌లో ఒత్తైన జుట్టు, గుబురు గెడ్డంతో ఓల్డ్ గెటప్‌లో సరికొత్తగా కనిపించి సర్‌ప్రైజ్ చేశారు కార్తి.. ప్రతి సినిమాలోనూ డిఫరెంట్ పాయింట్‌ని చూపించే దర్శకుడు మిత్రన్ ఈ సినిమాతో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌ని టచ్ చెయ్యబోతున్నారని మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

ఇదిలా ఉంటే ‘సర్దార్’ లో సీనియర్ యాక్ట్రెస్ సిమ్రాన్ విలన్‌గా నటించబోతున్నారని కోలీవుడ్ మీడియా సమాచారం. తెలుగులో టాప్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సిమ్రాన్ పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేశారు.

Seemaraja

తమిళ్ యంగ్ హీరో శివ కార్తికేయన్, సమంత జంటగా యాక్ట్ చేసిన ‘సీమరాజా’ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్‌‌తో రీ ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచారు సిమ్రాన్ . కట్టు, బొట్టుతో పద్ధతిగా కనిపిస్తూ తన స్టైల్ విలనిజంతో అలరించారామె. ‘సర్దార్’ లో సినిమాకి కీలకమైన లేడి విలన్ రోల్ సిమ్రాన్ చేస్తే బాగుంటుందని డైరెక్టర్ ఆమెను అప్రోచ్ అవగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే షూట్‌లో జాయిన్ అవబోతున్నారని తెలుస్తుంది.

Simran : సీనియర్ యాక్ట్రెస్ సిమ్రాన్ పిక్స్..