Sardar : ‘సర్దార్’ గా కార్తి.. వీడియో చూశారా!..

ఇటీవల ‘సుల్తాన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన తమిళ యంగ్ హీరో కార్తి కొత్త చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్ ఆదివారం విడుదల చేశారు. విశాల్‌తో ‘ఇరుంబి తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’), శివ కార్తికేయన్‌తో ‘హీరో’ సినిమాలతో తమిళ్, తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ డైరెక్ట్ చేస్తున్నారు..

Sardar : ‘సర్దార్’ గా కార్తి.. వీడియో చూశారా!..

Karthi New Movie Sardar Motion Poster

Sardar: ఇటీవల ‘సుల్తాన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన తమిళ యంగ్ హీరో కార్తి కొత్త చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్ ఆదివారం విడుదల చేశారు. విశాల్‌తో ‘ఇరుంబి తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’), శివ కార్తికేయన్‌తో ‘హీరో’ సినిమాలతో తమిళ్, తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ డైరెక్ట్ చేస్తున్నారు.

ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, రాజీషా విజయన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.. మోషన్ పోస్టర్ వీడియోలో ఒత్తైన జుట్టు, గుబురు గెడ్డంతో ఓల్డ్ గెటప్‌లో సరికొత్తగా కనిపించి సర్‌ప్రైజ్ చేశారు కార్తి.. దర్శకుడు ఈ సినిమాతో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌ని టచ్ చెయ్యబోతున్నారని అర్థమవుతోంది.

గత రెండు సినిమాల్లోనూ ఆసక్తికరమైన పాయింట్స్ చూపించిన మిత్రన్ ఈసారి కూడా మంచి సందేశంతో ఆకట్టుకోనున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది.. ఈ సినిమాకి కెమెరా : జార్జ్ సి విలియమ్స్, ఎడిటింగ్ : రూబెన్, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్, లిరిక్స్ : యుగభారతి..