Sircilla Weavers : రాజన్న సిరిసిల్లలో ఆగిపోయిన మరమగ్గాలు.. సమ్మె 7వ రోజు

గతంలో సమ్మె చేసిన సమయంలో.. కూలీ పెంచడానికి బదులుగా కార్మికులకు 10 శాతం సబ్సిడీ ఇస్తామని చేనేత జౌళి శాఖ అధికారులు హామీ ఇచ్చారు. అయితే 2018లో 10 శాతం సబ్సిడీ అందించారని...

Sircilla Weavers : రాజన్న సిరిసిల్లలో ఆగిపోయిన మరమగ్గాలు.. సమ్మె 7వ రోజు

Siricilla

Sircilla Weavers Strike : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరమగ్గాల కార్మికులు, అసాములు చేస్తున్న సమ్మె 7వ రోజుకు చేరింది. తమ డిమాండ్లను తీర్చే వరకు సమ్మెను విరమించబోమని ప్రకటించడంతో.. అటు చీరల ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్ లూమ్ కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ చెల్లించాలని, ఆసాములకు రావాల్సిన డాభి, పింజర సబ్సిడీ అందించాలన్న ప్రధాన డిమాండ్లతో సమ్మె కొనసాగుతోంది. 2018లో జరిగిన కూలీ ఒప్పందం మేరకు ప్రతి రెండు సంవత్సరాలకు కూలీ రేటు పెంచుకునే నియామవళి ఉంది. అయితే అధికారులు మాత్రం ఒప్పందాన్ని పట్టించుకోకపోవడంతో నేత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2020తో కూలీ ఒప్పందం గడువు ముగిసిందని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా కూలీ పెంచాలని ఆసాములు, కార్మికులు, వస్త్ర ఉత్పత్తి యజమానులు విన్నవించుకున్న ఫలితం లేదంటున్నారు.

Read More : Weather Report: తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

గతంలో సమ్మె చేసిన సమయంలో.. కూలీ పెంచడానికి బదులుగా కార్మికులకు 10 శాతం సబ్సిడీ ఇస్తామని చేనేత జౌళి శాఖ అధికారులు హామీ ఇచ్చారు. అయితే 2018లో 10 శాతం సబ్సిడీ అందించారని.. ఆ తర్వాత 2019, 20, 21 సంవత్సరాలకు అందాల్సిన సబ్సిడీ.. ఇంకా ఇవ్వలేదని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఒక రోజుకి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో దాదాపు 15 లక్షల మీటర్ల బట్ట ఉత్పత్తి అవుతుంది. అయితే ఆసాములు, కార్మికులు చేస్తున్న సమ్మెతో దాదాపు 45 లక్షల మీటర్ల వస్త్రం ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది.

Read More : Bhoiguda Fire Accident: బోయిగూడ అగ్నిప్రమాదానికి కారణం కనిపెట్టిన అధికారులు

ఈ సంవత్సరం బతుకమ్మ చీరలను 200 డిజైన్లలో, 10 రంగుల్లో తయారు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు చీరలు ఉత్పత్తి చేయాలంటూ మరమగ్గాల యజమానులకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది. వచ్చే ఆగస్టు నాటికి ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేయాలని నిర్దేశించింది. గతంలో ఉన్న బంగారు వర్ణం నూలు స్థానంలో ఈ సారి రంగుల నూలుతో డిజైన్లను రూపొందించారు. సిరిసిల్ల పరిశ్రమలోని 271 మ్యాక్స్‌, ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల యజమానులు బుధవారం నుంచి వస్త్రోత్పత్తి ఆర్డర్లు తీసుకుంటున్నారు. అధికారులు ఈ ఏడాది సిరిసిల్లకు 4.48 కోట్ల మీటర్లు, కరీంనగర్‌లోని గర్షకుర్తికి 14 లక్షలు, హనుమకొండకు 6.31 లక్షలు, వరంగల్‌కు 93 వేలు, మండేపల్లి టెక్స్‌టైల్‌ పార్కుకు 24 లక్షల మీటర్ల వస్త్రం ఉత్పత్తికి ఆర్డర్లు కేటాయించారు. రాష్ట్రంలో ఈ ఏడాది బతుకమ్మ చీరల కోసం 5 కోట్ల మీటర్ల వస్త్రం అవసరమని అంచనా వేశారు. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాల కంటే ముందే చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.