Mangli – Indravati : ‘ఊ’పుతున్న అక్కాచెల్లెళ్ల ఐటం పాట.. అసలు స్పెషాలిటీ అదే..!

నిజానికి ఇంద్రావతి గానీ.. మంగ్లీ గానీ.. ఇద్దరిదీ హై పిచ్ వాయిస్. వాయిస్ లో బేస్ ఎక్కువ. వీళ్లు పాడిన జానపదాలు కూడా.. ఆ హైపిచ్ వాయిస్ వల్లే జనంలోకి దూసుకుపోయాయి.

Mangli – Indravati : ‘ఊ’పుతున్న అక్కాచెల్లెళ్ల ఐటం పాట.. అసలు స్పెషాలిటీ అదే..!

Mangli Indravati Cover Pushpa Songs 2

Updated On : December 17, 2021 / 6:58 PM IST

Mangli – Indravati : అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో రిలీజైన ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ తెలుగులోనే కాదు యావత్ భారత సినీ అభిమానులను ఆకట్టుకుంది. ఓవరాల్ మూవీ రివ్యూ ఎలా ఉన్నా.. ఫస్టాఫ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనే టాక్ నడుస్తోంది. కొన్ని యాక్షన్ సీక్వెన్సులు, సాంగ్స్ కోసమైనా కచ్చితంగా చూడాల్సిన సినిమా అని యునానిమస్ టాక్ వినిపిస్తోంది. ఐతే.. పుష్ప సినిమాలో సమంత స్పెషల్ ఎట్రాక్షన్ గా వచ్చే ఐటమ్ సాంగ్ సినీ అభిమానులను భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా కిర్రెక్కిస్తోంది.

Read This : Pushpa: The Rise: పుష్ప: ది రైజ్.. రివ్యూ

ఊ అంటావా మావా.. ఉఊ అంటావా అంటూ తెలుగులో సాగే ఈ పాట కోసం.. సమంత అందాలు, అల్లు అర్జున్ గ్రేస్-స్వాగ్ చూడటం కోసం థియేటర్లకు వెళ్తున్నవాళ్లు ఉన్నారంటే నమ్మాల్సిందే. ఈ పాట కంపోజిషన్ లో.. ఎగ్జిక్యూషన్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఓ మ్యాజిక్ చేశారు.

తెలుగులో ఇంద్రావతి చౌహాన్ తో… కన్నడలో మంగ్లి అలియాస్ సత్యవతితో ఈ పాట పాడించాడనీ.. వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లన్న సంగతి తెలిసిందే. ఇంద్రావతి పాడిన పాట యూట్యూబ్ లో నంబర్ వన్ పొజిషన్ లో ట్రెండింగ్ లో ఉంది. పాట వింటుటే ఊపు రావడానికి .. కంపోజిషన్, లిరిక్స్ తోపాటు.. పాటలో ఇంద్ర హస్కీ వాయిస్ కూడా తోడైందని చెప్పొచ్చు. అక్కడే ఉంది అసలైన మ్యాజిక్.

నిజానికి ఇంద్ర గానీ.. మంగ్లీ గానీ.. ఇద్దరిదీ హై పిచ్ వాయిస్. వాయిస్ లో బేస్ ఎక్కువ. వీళ్లు పాడిన జానపదాలు కూడా.. ఆ హైపిచ్ వాయిస్ వల్లే జనంలోకి దూసుకుపోయాయి. కానీ.. ఊ అంటావా పాట లో టోన్ లో ఉంటుంది. గుసగుసలాడినట్టుగా అన్నమాట. ఇంద్ర గానీ.. మంగ్లీ గానీ.. ఇద్దరూ ఈ స్థాయిలో టోన్ తగ్గించి.. మార్చి పాడటం ఇదే ఫస్ట్ టైం. పాటలో చరణాలు మారుతున్నకొద్దీ.. సింగర్స్ వాయిస్ కు వేరియేషన్ ఇచ్చి.. ఒరిజినాలిటీని కూడా మెరుపులా వినిపించి ఛమక్కుమనిపిచారు దేవిశ్రీ ప్రసాద్.

Read This : Pushpa: పుష్ప సెకండ్ పార్ట్ టైటిల్ లీక్!

ఈ పాటను హిందీలో కనికా కపూర్, తమిళంలో ఆండ్రియా పాడారు. అక్కడ కూడా పాటలో ఏమాత్రం జోష్ తగ్గలే. దేవిశ్రీ ఐటమ్ పాటంటే అంతే.. స్పెషాలిటీలో తగ్గేదే లే..!

Mangli Indravati Cover Pushpa Songs 2

Mangli Indravati Cover Pushpa Songs 2

Mangli Indravati Cover Pushpa Songs 2

Mangli Indravati Cover Pushpa Songs 2

Mangli Indravati Cover Pushpa Songs 2

Mangli Indravati Cover Pushpa Songs 2

Mangli Indravati Cover Pushpa Songs 2

Mangli Indravati 4