software engineer letter : “జీవితంలో ఒంటరితనం అనుభవిస్తున్నాను.. సంతోషంగా ఉండేందుకు సలహా ఇవ్వండి” .. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాసిన లేఖ వైరల్

జీవితంలో అనుకున్నది సాధించలేక కొందరు.. అన్నీ ఉన్నా ఆందోళన చెందుతూ కొందరు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. మనసులో ఉన్న బాధని ఇతరులకు పంచుకోవడం ద్వారా జీవితంలో ఏదైనా మిరాకిల్ జరగొచ్చు. తన ఒంటరితనపు భారాన్ని మోయలేకపోతున్నానని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ట్విట్టర్‌లో రాసిన లేఖ వైరల్ అవుతోంది.

software engineer letter : “జీవితంలో ఒంటరితనం అనుభవిస్తున్నాను.. సంతోషంగా ఉండేందుకు సలహా ఇవ్వండి” .. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాసిన లేఖ వైరల్

software engineer letter

software engineer letter : జీవితం అనుకున్నట్లుగా లేకపోతే చాలామంది డిప్రెస్ అయిపోతున్నారు. అంతటితో జీవితం ముగిసిపోయిందని.. ఇంక ముందుకు సాగలేమని నిరాశ పడుతున్నారు. ఒక్కోసారి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మనసులో ఉన్న బాధని మనకు నచ్చినవారితో పంచుకోవడం వల్ల ఉపశమనం పొందచ్చు.. లేదంటే కొందరి సలహాలు మన జీవితానికి ఎంతో ఉపయోగపడొచ్చు. బెంగళూరుకి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తాను లైఫ్‌ని ఒంటరితనంతో భారంగా గడుపుతున్నానని.. జీవితం ఆసక్తికరంగా ఉండేందుకు తగిన సలహా ఇవ్వండని ట్విట్టర్‌లో లేఖ రాశాడు.

Shirdi temple : RBI కి లేఖ రాసిన శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్.. సమస్య ఏంటంటే?

జీవితం వడ్డించిన విస్తరి కాదు. దాన్ని మనకి అనువుగా మలుచుకునే క్రమంలో ఒక్కోసారి గెలుపోటములు సహజం. అనుకున్నది సాధించలేకపోయామని కొందరు.. అన్నీ ఉన్నా జీవితం సంతోషంగా లేదని కొందరు ఇటీవల కాలంలో నిరాశకు లోనవుతున్నారు. మనసులో బాధని దిగమింగుకునే క్రమంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. బెంగళూర్‌కి (bengaluru) చెందిన 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (software enginee) ట్విట్టర్ లో రాసిన లేఖ Sukhada అనే యూజర్ ద్వారా షేరై నెటిజన్లను ఆలోచింపచేస్తోంది. జీవితం చాలా నిరాశగా ఉందని.. భారంగా నడుస్తోందని అతను లేఖలో పంచుకున్నాడు. దాదాపుగా 3 సంవత్సరాలుగా ఒకటే ఉద్యోగంలో ఉన్నానని.. సంవత్సరానికి 58 లక్షల రూపాయల వరకూ సంపాదన ఉన్నా సంతోషం లేదని అతను లేఖలో పేర్కొన్నాడు. తన ఫ్రెండ్స్‌లాగ తన జీవితంలో గాళ్ ఫ్రెండ్ కూడా లేదని.. తన లైఫ్ సంతృప్తిగా అనిపించట్లేదని తన లేఖలో వెల్లడించాడు. జీవితం ఆసక్తికరంగా సాగాలంటే సలహా కావాలంటూ.. ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాసిన లేఖపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

Manish Sisodia: చదువుకున్న ప్రధాని కావాలంటూ ఏకంగా మోదీకే లేఖ రాసిన సిసోడియా
ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయని .. నీకున్న సంపాదన కూడా చాలామందికి ఇప్పుడు లేదని సంతోషంగా ఉండమని కొందరు.. గాళ్ ఫ్రెండ్ ఉన్నంత మాత్రనా సంతోషంగా దొరుకుతుందని చెప్పలేమని..నువ్వే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయమని మరికొందరు రకరకాలుగా సలహాలు ఇచ్చారు. ఏది ఏమైనా తనకున్న సమస్యను ట్విట్టర్ వేదికగా బయటపెట్టి తగిన సొల్యూషన్ కోసం ఆ యువకుడు చేసిన పని అభినందనీయమని చెప్పాలి. ఏ సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. నెటిజన్లు ఇచ్చే సమాధానాల్లో ఏదైనా అతనికి కొత్త మార్గం చూపించవచ్చు. చాలామంది అనుకుంటారు కష్టాలు చెప్పుకుంటే వెక్కిరిస్తారు అని.. కానీ ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విషయంలో ఆది అబద్ధమని రుజువైంది.