Solar Eclipse : ఆకాశంలో మరో అద్భుతం, డిసెంబర్ 04న సూర్యగ్రహణం | Solar Eclipse 2021 Last Surya Grahan Year

Solar Eclipse : ఆకాశంలో మరో అద్భుతం, డిసెంబర్ 04న సూర్యగ్రహణం

ఈ సంవత్సరంలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనుండగా. అందులో మూడు గ్రహాలు ఇప్పటికే సంభవించాయి.

Solar Eclipse : ఆకాశంలో మరో అద్భుతం, డిసెంబర్ 04న సూర్యగ్రహణం

Solar Eclipse 2021 : ఆకాశంలో మరో అద్భుతం జరుగబోతోంది. ఈ సంవత్సరంలో లాస్ట్ సూర్యగ్రహణం ఏర్పడనుంది. డిసెంబర్ 04వ తేదీన ఏర్పడనున్న సూర్యగ్రహణం కొన్ని దేశాల్లో మాత్రమే కనిపించనుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. భారత్ లో కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దక్షిణ అమెరికా, అంటార్కిటికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో కనిపిస్తుందంటున్నారు. భారత కాలమాన ప్రకారం…2021, డిసెంబర్ 04వ తేదీ ఉదయం 10.59 గంటలకు ప్రారంభమై…మధ్యాహ్నం 03.07 గంటలకు ముగియనుందని తెలియచేస్తున్నారు. గ్రహణం కారణంగా..కొన్ని నిమిషాల పాటు చీకటిగా మారనుందనే విషయం తెలిసిందే.

Read More : Parliament: చంటిబిడ్డ‌తో పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు వచ్చిన మహిళా ఎంపీ..అధికారుల ఆగ్రహం..మార్చండీ మీ రూల్స్ అంటూ ఫైర్

ఈ సంవత్సరంలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనుండగా. అందులో మూడు గ్రహాలు ఇప్పటికే సంభవించాయి. మే 26వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం, జూన్ 10వ తేదీన వార్షిక సూర్య గ్రహణం, నవంబర్ 19వ తేదీన పాక్షిక చంద్రగ్రహణాలు ఏర్పడ్డాయి. 580 సంవత్సరాల తర్వాత అరుదైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది. తాజాగా..డిసెంబర్ 04వ తేదీన సూర్య గ్రహణం సంభవించనుంది.

Read More : Bengaluru : బెంగళూరులో భారీ శబ్ధాలు..భూకంపం వచ్చిందా ?

సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకదానితో ఒకటి సమాంతరంగా వస్తాయి. దీంతో సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడతుందని శాస్త్రవేత్తలు చెబుతారు. గ్రహణ సమయంలో…చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేస్తాడు. దీని కారణంగా..కొన్ని నిమిషాలు లేదా సెకండ్ల పాటు ఆకాశం చీకటిగా ఉండి..రాత్రి మాదిరిగా అనిపిస్తుంది.

      ×