Sonakshi Sinha : బాలీవుడ్ బ్యూటీ, ఒకప్పటి స్టార్ హీరో కూతురు ఎంగేజ్మెంట్ చేసేసుకుందా??

సోనాక్షి చేతికి ఉన్న ఓ ఉంగరంని చూపిస్తూ ఫోటోని షేర్ చేసింది. అంతే కాకుండా ఓ వ్యక్తి చేతిని పట్టుకొని ఫోటో షేర్ చేసింది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం.............

Sonakshi Sinha : బాలీవుడ్ బ్యూటీ, ఒకప్పటి స్టార్ హీరో కూతురు ఎంగేజ్మెంట్ చేసేసుకుందా??

Sonakshi

Updated On : May 10, 2022 / 7:20 AM IST

Sonakshi Sinha :  శత్రఘ్ను సిన్హా కూతురు, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా దబాంగ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలని చేస్తుంది. ప్రస్తుతం సోనాక్షి చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. సోనాక్షి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ లో కొన్ని ఫోటోలని షేర్ చేసింది. ఈ ఫోటోలని, వాటికి పెట్టిన పోస్ట్ ని చూస్తే ఎవరైనా సరే తనకి ఎంగేజ్మెంట్ అయిపోయిందని అనుకుంటారు. మరి ఆ ఫోటోలు అలా ఉన్నాయి.

సోనాక్షి చేతికి ఉన్న ఓ ఉంగరంని చూపిస్తూ ఫోటోని షేర్ చేసింది. అంతే కాకుండా ఓ వ్యక్తి చేతిని పట్టుకొని ఫోటో షేర్ చేసింది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం చూపించలేదు, చెప్పలేదు. ఈ ఫోటోలని షేర్ చేసిన సోనాక్షి.. ”ఇది నాకు చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు నా బిగ్గెస్ట్ డ్రీమ్ నెరవేరబోతోంది. దాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇది జరిగిందంటే నేనే నమ్మలేకపోతున్నాను” అంటూ పోస్ట్ చేసింది.

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫోటోలు

దీంతో ఇది కచ్చితంగా సోనాక్షి పెళ్లి వార్తే అని, సోనాక్షి ఎంగేజ్మెంట్ చేసుకుందని అభిమానులు, బాలీవుడ్ వర్గాలు అంటున్నారు. అయితే ఇది నిజంగానే పెళ్లి విషయమా లేదా ఏదైనా ప్రమోషనల్ స్టంటా అని ఆలోచిస్తున్నారు. ఇటీవల కొంతమంది తమ సినిమాలని ఇలా కొత్తగా కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా అందుకే అలా ఆలోచిస్తున్నారు. మరి సోనాక్షి బిగ్ డ్రీమ్ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఇటీవలే సోనాక్షిపై, ఆమె ఫ్యామిలీపై ఓ బాలీవుడ్ నటి వివాదాస్పద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)