Sonia Gandhi: సిద్దూ రాజీనామా చేసేయ్ – సోనియా గాంధీ

కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ యాక్షన్ లోకి దిగారు. ఈ మేరకే పంజాబ్ పార్టీ చీఫ్ అయిన నవజోత్ సింగ్ సిద్దూను రాజీనామా చేయాలని ఆదేశించారని. పార్టీ అధికార ప్రతినిధి ప్రకటించారు.

Sonia Gandhi: సిద్దూ రాజీనామా చేసేయ్ – సోనియా గాంధీ

Sonia Gandhi

Sonia Gandhi: కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ యాక్షన్ లోకి దిగారు. ఈ మేరకే పంజాబ్ పార్టీ చీఫ్ అయిన నవజోత్ సింగ్ సిద్దూను రాజీనామా చేయాలని ఆదేశించింది. పార్టీ అధికార ప్రతినిధి అయిన రణదీప్ సర్జేవాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. రీసెంట్ గా ముగిసిన ఎన్నికల్లో పంజాబ్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ కేవలం 18సీట్లు మాత్రమే సాధించింది. 117 సీట్లకు గానూ ఆప్ 92 దక్కించుకుని భారీ మెజారిటీతో గెలుపొందింది.

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూ అమృత్‌సర్ ఈస్ట్ సీట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆప్ అభ్యర్థి జీవన్‌జ్యోత్ కౌర్ 6వేల 750ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఈ సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన సోనియా గాంధీ.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లోని పీసీసీ ప్రెసిడెంట్లను రాజీనామా చేయాలని ఆదేశించారు. ఆ పదవుల్లో కీలక మార్పులు చేయాలని ఇలా చేసినట్లు తెలుస్తోంది.

Read Also : సీడబ్ల్యూసీ మీటింగ్ ఓవర్.. సోనియానే నమ్ముకున్నాం

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి తరువాత, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ సోమవారం చరణ్‌జిత్ సింగ్ చన్నీపై విరుచుకుపడ్డారు. బాధ్యతతో పనిచేసే వ్యక్తిని అవమానించడమే పార్టీకి చెడు చేసిందని అన్నారు.