Sonu Nigam : సింగర్ సోనూనిగమ్‌కు పద్మశ్రీ..

 బాలీవుడ్ లోనే కాక దేశంలోని చాలా భాషల్లో దాదాపు 25 సంవత్సరాలకుపైగా పాటలు పాడుతూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు సోనూ నిగమ్. తాజాగా ఆయనకు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో...

Sonu Nigam : సింగర్ సోనూనిగమ్‌కు పద్మశ్రీ..

Sonu Nigam

Updated On : January 26, 2022 / 7:41 AM IST

Sonu Nigam :  బాలీవుడ్ లోనే కాక దేశంలోని చాలా భాషల్లో దాదాపు 25 సంవత్సరాలకుపైగా పాటలు పాడుతూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు సోనూ నిగమ్. తాజాగా ఆయనకు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కళారంగంలో అనేక సేవలందించినందుకు గాను సోనూనిగమ్​కు ‘పద్మశ్రీ’ అవార్డు ప్రకటించారు.

చిన్నప్పటి నుండే పలు వేదికలపైన సింగర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టిన సోనూనిగమ్ 1990లలో బాలీవుడ్ లో సింగర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా హిందీలో సాంగ్స్ పాడుతూ పాపులర్ అయ్యారు. అయన పాడిన ప్రతి పాటకి విశేష స్పందన రావడంతో మిగతా భాషల సినిమా వాళ్ళు కూడా సోనూ నిగమ్ తో పాటలు పాడించారు.

Kinnera Mogulaiah : పవన్ కళ్యాణ్ పాటతో హైప్.. కిన్నెర మొగులయ్యకి పద్మశ్రీ

సోనూనిగమ్ హిందీలోనే కాక తెలుగు, బెంగాలీ, అస్సామీ, భోజ్ పురీ, ఇంగ్లీషు, కన్నడం, మలయాళం, మైథిలి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, తుళు, తమిళం, ఉర్దూ… భాషల్లో అన్ని రకాల పాటలని పాడారు సోనూ నిగమ్. తన పాటలతో ఇప్పటికే ఎన్నో అవార్డులని, రివార్డులని సాధించిన సోనూనిగమ్ తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.