Sonu Sood: రిజక్ట్ చేసిన మ్యాగజైన్ కవర్‌పైనే సోనూసూద్ ఫొటో
స్టార్‌డస్ట్ మ్యాగజైన్ కవర్ ఫొటోగా సోనూసూద్ పిక్ ను పబ్లిష్ చేసింది. ఆ విషయం గుర్తు చేసుకున్న సోనూసూద్.. ఓ సారి తనను ఆడిషన్ చేసి రిజక్ట్ చేసిన మ్యాగజైన్ ఇప్పుడు కవర్ ఫొటోగా ప్రచురించిందని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.

Sonu Sood
Sonu Sood: స్టార్‌డస్ట్ మ్యాగజైన్ కవర్ ఫొటోగా సోనూసూద్ పిక్ ను పబ్లిష్ చేసింది. ఆ విషయం గుర్తు చేసుకున్న సోనూసూద్.. ఓ సారి తనను ఆడిషన్ చేసి రిజక్ట్ చేసిన మ్యాగజైన్ ఇప్పుడు కవర్ ఫొటోగా ప్రచురించిందని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.
‘స్టార్‌డస్ట్ మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం పంజాబ్ నుంచి నా ఫొటోలను పంపిస్తే రిజక్ట్ అయ్యాయి. ఇవాళ నా ఫొటోను కవర్ పిక్ గా మార్చినందుకు వారికి థ్యాంక్స్ చెబుతున్నా’ అని పోస్టు చేశారు.
కరోనా మహమ్మారి ప్రభావం నాటి నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ.. ప్రతి రోజూ సేవలను విస్తరిస్తూ వస్తోన్న సోనూ సూద్ కు దేశవ్యాప్తంగా అభిమానులు పెరుగుతూ వస్తున్నారు. హాస్పిటల్ బెడ్స్ కావాలని, ఆక్సిజన్ సప్లై కావాలని, మెడిసిన్స్ కావాలని ఫోన్లు, మెసేజ్ ల ద్వారా అడుగుతూనే ఉన్నారు.
ప్రజలకు సహాయం చేయడంలో తానేమీ మెస్సయ్యను కాదని.. స్వీయానుభవాన్ని చెప్పిన కథనాన్ని పత్రికలు ప్రచురించాయి. గత నెలలో అతని ఫోన్ కు ఆగకుండా వస్తున్న మెసేజ్ ల వీడియోను.. సోనూసూద్ షేర్ చేశారు.
‘మిమ్మల్ని చేరుకునేందుకు మాకు వీలైనంత వరకూ కష్టపడుతున్నాం. ఏదైనా ఆలస్యం జరిగినా, చేరుకోలేకపోయినా క్షమించమని మన్నింపు కోరుతున్నా’ అని పోస్టు చేశాడు. మరో ట్వీట్ లో.. ప్రజలకు మెడికల్ సాయం చేయడమనేది రూ.100కోట్ల సినిమాకు పని చేయడం కంటే సంతోషమిస్తుందని అన్నారు.