Sonu Sood : శివశంకర్ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తా- సోనూసూద్

సోనూ సూద్...శివశంకర్ కుటుంబంతో మాట్లాడారు. కుమారుడు అజయ్ తో మాట్లాడి..తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తనవంతు ప్రయత్నాలు చేస్తానని హామీనిచ్చారు.

Sonu Sood : శివశంకర్ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తా- సోనూసూద్

Sonusood

Updated On : November 25, 2021 / 3:47 PM IST

Sonu Sood Helping Shiva Shankar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ప్రాణాలు కాపాడేందుకు తనవంతు ప్రయత్నిస్తానని బాలీవుడ్ నటుడు సోనూసూద్ వెల్లడించారు. ఆయనకు కరోనా సోకిందని..ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే విషయాన్ని వంశీ కాక సోనూ సూద్ ను ట్యాగ్ చేస్తూ.. ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. దీనికి సోనూ సూద్ రిప్లై ఇచ్చారు. శివశంకర్ కుటుంబాన్ని తాను అప్పటికే సంప్రదించానని …. శివశంకర్ ప్రాణం కాపాడేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పారు. శివశంకర్ చిన్న కుమారుడు అజయ్ తో మాట్లాడిన సోనూసూద్..తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Read More : Nellore : ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పోతా..ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతా : చంద్రబాబు

కరోనా సోకడంతో.. శివశంకర్ గత నాలుగు రోజులుగా హైదరాబాద్ AIG ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 75 శాతం పైగా ఊపిరితిత్తులు పాడైపోవడంతో.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. శివశంకర్ మాస్టర్ కుటుంబం మొత్తం కరోనా వైరస్ బారిన పడడం అందర్నీ కలిచి వేస్తోంది. పెద్ద కొడుక్కి కూడా కరోనా సోకి.. అపస్మారకస్థితిలో ఉన్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ సతీమణికి సైతం కరోనా సోకడంతో..ఆమె హోం క్వారంటైన్ లో ఉన్నారు.

Read More : Priest Told to Kiss: పెళ్లి పీటలపైనే ముద్దు పెట్టుకోమని చెప్పిన పూజారి

చిన్న కొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే..ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. శివశంకర్ మాస్టర్ కు చికిత్స అందించడం కష్టమౌతోందని, రోజుకు లక్షల రూపాయల వైద్య ఖర్చుల అవుతోందని సమాచారం. ఎన్నో గొప్పపాటలకు నృత్యాలను సమకూర్చి…జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన శివశంకర్ మాస్టర్ కు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని పలువురు పేర్కొంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేస్తున్నారు.