Nellore : ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పోతా..ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతా : చంద్రబాబు

తాను ముఖ్యమంత్రి అయ్యాకనే అసెంబ్లీకి పోతానని..అప్పటి వరకు ప్రజాక్షేత్రంలోనే ఉండి పోరాడుతానని మరోసారి చెప్పారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు.

Nellore : ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పోతా..ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతా : చంద్రబాబు

Babu

Chandrababu Naidu Tour : తాను ముఖ్యమంత్రి అయ్యాకనే అసెంబ్లీకి పోతానని..అప్పటి వరకు ప్రజాక్షేత్రంలోనే ఉండి పోరాడుతానని మరోసారి చెప్పారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. తనను..తన కుటుంబసభ్యులను అవమానపరిచారని..తాను సీఎం అయ్యాకే..అసెంబ్లీకి వస్తానంటూ..శపథం చేసి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ..వరద బాధితులతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Read More : Kodali Nani : జూ.ఎన్టీఆర్‌తో విడిపోయాం మంత్రి కొడాలి నాని క్లారిటీ!

చిత్తూరు జిల్లాలో పర్యటించిన బాబు…2021, నవంబర్ 25వ తేదీ గురువారం నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలోని నాయుడుపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చిత్తూరు, కడప జిల్లాల్లో ప్రభుత్వ వైఫల్యం వల్ల..ఎమ్మెల్యేల అధికార దుర్వినియోగం వల్ల 60 మృతి చెందారని, వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వెల్లడించారు. ముందుజాగ్రత్త తీసుకుని ఉంటే…అందరూ బ్రతికేవాళ్లని…అన్నమో రామచంద్రా అంటూ ప్రజలు అల్లాడుతున్నారన్నారు. అయితే..సీఎం జగన్ మాత్రం అసెంబ్లీ కూర్చొని పొగిడించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Read More : Varla Ramaiah : మేనల్లుడిగా ఎన్టీఆర్ ఫెయిల్: వర్ల రామయ్య

ప్రభుత్వ విధానాలపై ఆయన మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు సతమతమౌతుంటే…కొత్తగా మోటార్ వెహికల్ పన్ను అని ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. నాన్న తాగితే..అమ్మ ఒడి  ఇస్తానని అంటున్నారని, మద్యం అమ్మకాల ఆదాయంతో సంక్షేమ పథకాలు ఇస్తారని అంటున్నారని విమర్శించారు. పేదలరక్తం తాగి సంక్షేమ పథకాలా ? అంటూ ప్రశ్నించారాయన. తనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉంటారని, తనను అసెంబ్లీలో అవమానపరిచారని చెప్పుకొచ్చారు. చివరకు తన కుటుంబాన్ని కూడా లాగారని మరోసారి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు వెల్లడించారు.