Sooryavanshi: బాలీవుడ్‌కి బ్రీతింగ్ ఇచ్చిన సూర్యవన్షీ సక్సెస్!

కోవిడ్ తర్వాత ఎన్నో ఆశలతో రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ. థియేటర్లకు జనం వస్తారా.. అసలు సినిమా సక్సెస్ అవుతుందా.. లాభాలు సంగతి సరే.. మినిమం బ్రేక్ ఈవెన్ అయినా రీచ్ అవుతామా అనుకుంటూ..

Sooryavanshi: బాలీవుడ్‌కి బ్రీతింగ్ ఇచ్చిన సూర్యవన్షీ సక్సెస్!

Sooryavanshi

Sooryavanshi: కోవిడ్ తర్వాత ఎన్నో ఆశలతో రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ. థియేటర్లకు జనం వస్తారా.. అసలు సినిమా సక్సెస్ అవుతుందా.. లాభాలు సంగతి సరే.. మినిమం బ్రేక్ ఈవెన్ అయినా రీచ్ అవుతామా అనుకుంటూ భయం భయంగా రిలీజ్ అయిన సూర్యవన్షీ బాక్సాఫీస్ బద్దలయ్యే కలెక్షన్లతో దూసుకుపోతోంది. సెకండ్ వేవ్ తర్వాత బాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సూర్యవన్షీ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇంతకీ ఈ బ్లాక్ బస్టర్ సూర్యవన్షీ హిట్ ఎవరెవరికి ఎంత మైలేజ్ ఇచ్చినట్లు అన్నది ఆసక్తిగా మారింది.

Kaikala Satyanarayana: అత్యంత విషమంగా కైకాల ఆరోగ్య పరిస్ధితి..!

సూర్యవన్షీ సినిమా రిజల్ట్ కోసం బాలీవుడ్ మొత్తం ఈగర్ గా వెయిట్ చేసింది. ఇప్పటికే 150 కోట్ల కలెక్షన్లు దాటేసిన సూర్యవన్షీ 200కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతోంది. కోవిడ్ తర్వాత కోమాలో ఉన్న బాలీవుడ్ కి సూర్యవన్షీ సక్సెస్ మంచి బ్రీతింగ్ ఇస్తోంది. సూర్యవన్షీ మొత్తం బడ్జెట్ దాదాపు 200కోట్లు అయ్యింది. అయితే వీటిలో ఓటీటీ రైట్స్ 80కోట్లు, శాటిలైట్ రైట్స్ 50కోట్లు కలిపితే..130కోట్లు ఆల్రెడీ వచ్చేసినట్టే. అయితే ఇప్పటికే గ్రాస్ గా వచ్చిన 150 కోట్లతో సినిమా సేఫ్ లోకి వచ్చేసింది.

Unstoppable with NBK: బాలయ్యతో రోజా.. మరో క్రేజీ ఎపిసోడ్ ఖాయం?

కలెక్షన్లతోనే కాదు ఈ సినిమా సక్సెస్ చాలా మందికి బూస్టప్ ఇచ్చింది. స్పెషల్లీ డైరెక్టర్ రోహిత్ శెట్టి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సూర్యవన్షీ.. సినిమా సక్సెస్ తో తన కోరిక తీరిందంటూ ఫుల్ ఖుష్ అవుతున్నారు రోహిత్. అసలే రెండేళ్లనుంచి సరైన సినిమా లేని బాలీవుడ్..సూర్యవన్షీ సక్సెస్ తో ఊపిరిపీల్చుకుని సినిమాలు రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతోంది. అంతేకాదు.. ఈ సినిమా హీరోలైన అక్షయ్, అజయ్, రణబీర్ కి కెరీర్ లో ఈ యాక్షన్ మూవీ మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

Etharkkum Thunindhavan: సూర్య నెక్స్ట్ సినిమా.. థియేటర్‌లోనా.. ఓటీటీలోనా?

అసలు కోవిడ్ కంటే ముందే రిలీజ్ అయ్యి ఉంటే ఈ సినిమా ఈజీగా 300కోట్లు కలెక్ట్ చేసుండేదని ఇప్పటికే లెక్కలేశారు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు. ఆల్రెడీ 4 వారాల పాటు సినిమా ధియేటర్లో ఉంచి.. ఆ తర్వాత మాత్రమే ఓటీటీలోకి రిలీజ్ చెయ్యాల్సి ఉంటుంది సినిమాలు. జనాల్ని ధియేటర్లకు రప్పించడంలో కీ రోల్ ప్లే చేసిన అక్షయ్ కుమార్ ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా ఉండడంతో.. ఒకసారి 200కోట్లు దాటితే ఆ లాభాల్లో ఎక్కువ బెనిఫిట్ అక్షయ్ కే అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.