Telangana Special Scheme : తెలంగాణలో బీసీల కోసం ప్రత్యేక పథకం!

రైతుల కోసం రైతు బంధు, దళితుల కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు బీసీలపై దృష్టి సారించింది. త్వరలోనే అర్హులైన బీసీలకు లాభం చేకూర్చేలా మరో కొత్త పథకం రూపొందిస్తోందని తెలుస్తోంది.

Telangana Special Scheme : తెలంగాణలో బీసీల కోసం ప్రత్యేక పథకం!

Bc Special Scheme

Special scheme for BCs : రైతుల కోసం రైతు బంధు, దళితుల కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు బీసీలపై దృష్టి సారించింది. త్వరలోనే అర్హులైన బీసీలకు లాభం చేకూర్చేలా మరో కొత్త పథకం రూపొందిస్తోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రానున్నట్టు సమాచారం.

తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు స్వయం సమృద్ధి సాధించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించింది.. వాటిని అమలు కూడా చేస్తోంది.. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేళ దళిత బంధు పథకాన్ని తెరపైకి తీసుకొచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ప్రారంభిస్తామని ప్రకటించింది.. కానీ సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఇప్పటికే అమలు చేశారు.. అర్హులైన దళితుల అకౌంట్లలో 10 లక్షల రూపాయలను జమ చేశారు.. త్వరలో ఈ పథకాన్ని హుజూరాబాద్‌లో కూడా అమలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం..

దళితుల కోసం ఓ పథకాన్ని ప్రవేశపెట్టినట్టే.. బీసీల కోసం ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకురాబోతుంది కేసీఆర్‌ ప్రభుత్వం.. ఈ పథకానికి రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్‌.. దళితులకు దళితబంధు మాదిరిగానే.. అర్హులైన బీసీలకు బీసీ పథకం చేసేందుకు సన్నాహాలు కూడా పూర్తైనట్టు తెలుస్తోంది.. అయితే ఈ పథకానికి ఏ పేరు పెట్టాలనే అంశంపై అంతర్గతంగా చర్చ జరుగుతోంది..

దళితబంధు పథకం కింద ఏఏ వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయో.. బీసీ బంధు కింద కూడా అవే అవకాశాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఓ పథకం తీసుకురావాలని నిర్ణయంచారు.. బీసీల కోసం అమలు చేయబోయే పథకానికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.