Sports Drama Films: ఇప్పుడంతా స్పోర్ట్స్ డ్రామాలే.. ఆటగాళ్లవుతున్న స్టార్స్

బాలీవుడ్ లో స్పోర్ట్స్ డ్రామా ట్రెండ్ నడుస్తోంది. సెట్స్ పై మాక్సిమమ్ స్టార్స్ ఆటగాళ్లలా మారిపోతున్నారు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో.. క్రికెటర్స్ బయోపిక్ సినిమాలు వెండితెరపై..

Sports Drama Films: ఇప్పుడంతా స్పోర్ట్స్ డ్రామాలే.. ఆటగాళ్లవుతున్న స్టార్స్

Sports Drama Films (1)

Sports Drama Films: బాలీవుడ్ లో స్పోర్ట్స్ డ్రామా ట్రెండ్ నడుస్తోంది. సెట్స్ పై మాక్సిమమ్ స్టార్స్ ఆటగాళ్లలా మారిపోతున్నారు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో.. క్రికెటర్స్ బయోపిక్ సినిమాలు వెండితెరపై అప్పుడప్పుడూ సందడి చేస్తూనే ఉన్నాయి. వాటితో పాటే బాక్సింగ్, ఫుట్ బాల్.. ఇలా అన్ని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ను టచ్ చేస్తూ ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.

Bigg Boss 5 Elimination: రవి ఔట్.. అదే నిజమైతే విమర్శలు తప్పదా?

83.. బాలీవుడ్ ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న సినిమా. ఇండియన్ క్రికెట్ టీమ్ ఫస్ట్ టైమ్ ప్రపంచకప్అందుకున్న మధుర క్షణాలే మెయిన్ థీమ్ గా రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా ఇది. లీడ్ రోల్ కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటిస్తుండగా.. ఆయన వైఫ్ రోమీ భాటియాగా దీపికా పదుకోణ్ కనిపించనుంది. పిఆర్ మాన్ సింగ్ గా పంకజ్ త్రిపాఠి, సునీల్ గవాస్కర్ గా తాహిర్ రాజ్, కృష్ణామాచారి శ్రీకాంత్ రోల్ లో జీవా.. ఇలా సూపర్ స్టార్ కాస్ట్ తో కబీర్ ఖాన్ 83ను డైరెక్ట్ చేసాడు. డిసెంబర్ 24న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. హిందీతో పాటూ సౌత్ లాంగ్వెజెస్ అన్నింటిలోనూ 83తో మరోసారి పాత జ్ఞాపకాలను కళ్లముందుంచ బోతున్నారు 83 టీమ్.

OTT Release Clash: నువ్వా.. నేనా.. ఓటీటీల్లోనూ రిలీజ్ వార్

టాలీవుడ్ స్టార్ నాని నటించిన క్రికెట్ బ్యాక్ డ్రాప్ ప్రాజెక్ట్ జెర్సీ బాక్సాపీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీని బాలీవుడ్ లో ఇదే పేరుతో రీమేక్ చేసారు. షాహిద్ కపూర్ లీడ్ రోల్ చేసిన ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గానే రిలీజైంది. తెలుగు వెర్షన్ లోని ఫ్లేవర్ ను ఏ మాత్రం మార్చకుండా ట్రైలర్ను కట్ చేశాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. తెలుగులో శ్రద్దా శ్రీనాథ్ చేసిన క్యారక్టర్ లో మృణాళ్ ఠాకూర్ నటించింది. ఇక కోచ్గా షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ నటించాడు. తండ్రిగా, లవర్గా, భర్తగా, క్రికెటర్గా షాహిద్ కపూర్ పలు రకాలభావోద్వేగాలను అద్బుతంగా పండించినట్టు ట్రైలర్తో తెలిసిపోతుంది. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ 31న రాబోతుంది.

Rajamouli : తమిళ మీడియాకి క్షమాపణలు చెప్పిన జక్కన్న

వుమెన్స్ నేషనల్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సీ నటిస్తోంది. శభాష్ మిథూ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వుమెన్ క్రికెట్ టీమ్ ఫాస్ట్ బౌలర్ జులాన్ గోస్వామిగా కనిపించేందుకు అనుష్కా శర్మ రెడీఅవుతోంది. మిథాలీగా తాప్సీ ఆల్రెడీ నటిస్తుంటే.. అనుష్కా శర్మ జులాన్ గోస్వామి బయోపిక్ పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. శభాష్ మిథూ సినిమా షూటింగ్ పూర్తి చేసిన తాప్సీ.. రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.

Indian Actress: రెచ్చిపోతాం.. హాలీవుడ్‌లో ముద్దుగుమ్మల బోల్డ్ క్యారెక్టర్స్!

ఓ ప్లేయర్ గా.. కెప్టెన్ గా ఎంతోమందిని ప్రోత్సహించి భారతీయ క్రికెట్ కు జోష్ తెచ్చిన పేరుంది గంగూలీకి. హర్భజన్ సింగ్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ధోనీ వంటి వారు గంగూలీ కెప్టెన్సీలో అరంగేట్రం చేసినవారే. ఇప్పుడాయన జీవితాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ లవ్ రంజన్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇంకా స్టార్ కాస్ట్ ఫైనల్ కాని గంగూలీ బయోపిక్ లో దాదాగా కనిపించే హీరో ఎవరన్నది ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఎంఎస్ ధోని కమర్షియల్ సక్సెస్ కొట్టింది. సచిన్ అ బిలియన్ డ్రీమ్స్ పేరుతో సచిన్ బయోపిక్ వచ్చినా.. అది డాంక్యుమెంటరీ ఫిల్మ్ గానే నిలిచింది. అజారుద్దీన్ గా ఇమ్రాన్ హష్మీ చేసిన అజార్ మూవీ ఆవరేజ్ టాక్ తెచ్చుకుంది.

Bigg Boss 5: పింకీ ఔట్.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఈమేనా?

బాక్సింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది లైగర్. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోతో టాలీవుడ్ మూవీ అనిపించినా.. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కావడంతో బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఈ స్పోర్ట్స్ డ్రామాపై ఇంట్రెస్ట్ పెరిగింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టార్ మైక్ టైసన్ నటిస్తుండటంతో ఆ బాక్సింగ్ బొనాంజాపై మరింత బజ్ క్రియేటయింది. 2022లో లైగర్ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇండియన్ లెజెండరీ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం బయోగ్రఫీ మైదాన్ గా ముస్తాబవుతోంది. అజయ్ దేవగణ్ రహీంగా నటిస్తున్నారు. 1950నాటి రియలిస్టిక్ అప్రోచ్ తో రవీందర్ నాథ్ శర్మ మైదాన్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ వేదికపై ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ ఎలా నిలబడిందనేది మైదాన్ ఒరిజనల్ కాన్సెప్ట్.

December Film Releases: ఇయర్ ఎండ్ సిల్వర్ స్క్రీన్ స్టార్ హీరోలదే!

బాలీవుడ్ లోనే కాదు సౌత్ లోనూ స్టోర్ట్స్ డ్రామాలు చాలానే సెట్స్ పై ఉన్నాయి. కీర్తి సురేశ్ లీడ్ రోల్ చేసిన గుడ్ లక్ సఖి కూడా స్పోర్ట్స్ డ్రామానే. బంజారా అమ్మాయి.. షూటర్ గా మారిన కథతో కీర్తి రాబోతుంది. నాగశౌర్య లక్ష్య సినిమా ఆర్చరీ నేపథ్యంగా తెరకెక్కింది. ఈ సినిమాపై బాగానే ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నాడు శౌర్య. గుడ్ లక్ సఖి, లక్ష్య రెండూ కూడా డిసెంబర్ 10న రిలీజ్ కాబోతున్నాయి. ఆది పిని శెట్టి క్లాప్ అనే సినిమాతో త్వరలో వచ్చేస్తున్నాడు. ట్రైలర్ రన్నర్ గా మ్యాజిక్ చేసిన ఆది.. చివర్లో కాళ్లు పొగొట్టుకునే క్యారెక్టర్ లో ట్విస్ట్ ఇచ్చాడు.