Rajamouli : తమిళ మీడియాకి క్షమాపణలు చెప్పిన జక్కన్న
ఆ తర్వాత 'జనని' సాంగ్ తమిళ్ వర్షన్ ని చెన్నైలో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తమిళ మీడియాతో ఇంటరాక్ట్ కానందుకు తమిళ సినీ, మీడియా సోదరులకు.......

Rajamouli
Rajamouli : ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా వైడ్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటంతో అన్ని భాషల్లో ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంతో సహ అనేక బాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. జక్కన్న దగ్గరుండి మరీ ఈ ప్రమోషన్స్ చేయిస్తున్నాడు. ప్రతి ఈవెంట్ లో అన్ని తానై చూసుకుంటున్నాడు. ప్రతి ప్రమోషన్ లోను రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని స్వయంగా ప్రమోట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
Radheshyam : ‘రాధేశ్యామ్’ సెకండ్ సాంగ్ టీజర్ రేపే…
ఇటీవల ఈ సినిమా నుంచి ‘జనని’ అనే పాట రిలీజ్ అయింది. ఈ పాటని అన్ని భాషల్లో చిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రమోషన్ చేస్తూ రిలీజ్ చేశారు. బెంగళూరులో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ‘జనని’ కన్నడ పాటను రాజమౌళి విడుదల చేస్తూ కన్నడలోనే మాట్లాడారు. అయితే తనకు కన్నడ అంత బాగారాదని, దయచేసి అపార్థం చేసుకోకండని అక్కడి మీడియాతో అన్నారు.
Bigg Boss 5 : నేను ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేశాను.. సిరికి షాకిచ్చిన శ్రీహాన్
ఆ తర్వాత ‘జనని’ సాంగ్ తమిళ్ వర్షన్ ని చెన్నైలో రిలీజ్ చేశారు. ఈ ప్రమోషన్ ని తమిళ్ లో ‘ఆర్ఆర్ఆర్’ని రిలీజ్ చేస్తున్న లైకా ప్రొడక్షన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తమిళ మీడియాతో ఇంటరాక్ట్ కానందుకు తమిళ సినీ, మీడియా సోదరులకు క్షమాపణలు చెప్పారు. జనవరిలో సినిమా విడుదలకు ముందు జరిగే గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో తప్పకుండా తమిళ మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తానని, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడతానని రాజమౌళి తమిళ మీడియాకి తెలిపారు.