OTT Release Clash: నువ్వా.. నేనా.. ఓటీటీల్లోనూ రిలీజ్ వార్ Release Clash in OTT platform

OTT Release Clash: నువ్వా.. నేనా.. ఓటీటీల్లోనూ రిలీజ్ వార్

థియేటర్స్ లోనే కాదు ఓటీటీల్లోనూ ఇప్పుడు ఫుల్ క్లాషెస్ వస్తున్నాయి. సేమ్ రెండు పెద్ద సినిమాలు ఒకేసారి థియేటర్స్ లో రిలీజైతే ఎలా షేర్ డివైడ్ అవుతుందో.. అలాగే పేరున్న సిరీస్ ఒకేసారి..

OTT Release Clash: నువ్వా.. నేనా.. ఓటీటీల్లోనూ రిలీజ్ వార్

OTT Release Clash: థియేటర్స్ లోనే కాదు ఓటీటీల్లోనూ ఇప్పుడు ఫుల్ క్లాషెస్ వస్తున్నాయి. సేమ్ రెండు పెద్ద సినిమాలు ఒకేసారి థియేటర్స్ లో రిలీజైతే ఎలా షేర్ డివైడ్ అవుతుందో.. అలాగే పేరున్న సిరీస్ ఒకేసారి హోమ్ ఎంట్రీ ఇస్తే ఆడియెన్స్ కన్ఫ్యూజై.. సపరేట్ అవుతారు. మళ్లీ టై తీసుకుని చూస్తారు కానీ ఫస్ట్ డే స్ట్రీమింగ్ కి ఇది దెబ్బ. ఇప్పుడిలా పోటాపోటిగా సిరీస్ లు రాబోతున్నాయి.

Indian Actress: రెచ్చిపోతాం.. హాలీవుడ్‌లో ముద్దుగుమ్మల బోల్డ్ క్యారెక్టర్స్!

ప్రామినెంట్ క్లాష్ గా తీసుకోవాలంటే ముందుగా ఇండియన్ సిరీస్ లు అరణ్యక్, ఆర్య సీజన్ 2 గురించి చెప్పుకోవాలి. డిసెంబర్ 10న నెట్ ఫ్లిక్స్ లో అరణ్యక్ స్ట్రీమింగ్ కాబోతుంటే అదే రోజు డిస్నీ హాట్ స్టార్ లో ఆర్య సీజన్ 2 స్ట్రీమింగ్ కి రెడీఅయింది. నిజానికి వీటిలో విన్నర్ గా నిలిచే ఛాన్స్ ఆర్యకే ఉంది. ఎందుకంటే గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ తో ఆర్య సీజన్ 1 ప్రతిఒక్కరినీ కట్టిపడేసింది. సుస్మితా సేన్ యాక్షన్ మేజర్ సెల్లింగ్ పాయింట్. సో ఆడియెన్స్ వెయిట్ చేస్తోన్న ఆర్య సీజన్ 2 డిసెంబర్ 10న బిగ్ సక్సెస్ కొట్టొచ్చు.

Akhanda: నో డౌట్.. మరోసారి మాస్ మానియాని చూపించిన బాలయ్య!

ఏమో గుర్రం ఎగరావచ్చు టైప్ లో అరణ్యక్ సడెన్ సర్ ప్రైజ్ చేసినా ఆశ్చర్యం లేదు. రీసెంట్ గా రిలీజైన అరణ్యక్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ చూస్తుంటే ఆడియెన్స్ కు కనెక్టయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. రవీనా టండన్, పరమ్ బత్ర ఛటర్జీ, అశుతోష్ రాణా వంటి వారు కీ రోల్స్ చేసిన ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ బాగానే ప్రమోట్ చేస్తుంది. మరి సీనియర్ హీరోయిన్స్ మధ్య పోటీలో.. ఆర్యతో సుస్మితా సేన్ గెలుస్తుందో.. అరణ్యక్ తో రవీనా సక్సెస్ కొడుతుందా అన్నది సస్పెన్స్ గా మారింది.

OTT Release: తగ్గేదే లే అంటున్న ఓటీటీలు.. ఈ వారం పది సినిమాలు!

డిసెంబర్ 3న మనీ హీస్ట్ సీజన్ 5 వ్యాల్యూమ్ 2 రాబోతుంది. అదే రోజు ఇన్ సైడ్ ఎడ్జ్ సీజన్ 3 స్ట్రీమింగ్ కి రెడీ అయింది. మనీ హీస్ట్ నెట్ ఫ్లిక్స్ లో.. ఇన్ సైడ్ ఎడ్జ్ ప్రైమ్ లో సందడి చేస్తాయి. మనీ హీస్ట్ పై ఫుల్ హోప్స్ అండ్ గ్యారంటీ హిట్ టాక్ ఉన్నా.. ఇన్ సైడ్ ఎడ్జ్ కూడా తక్కువేమి కాదు. కాకపోతే ముందు ప్రేక్షకులు మనీ హీస్ట్ ను చూసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈలోపు పైరసీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ దెబ్బతీస్తే రెండో దానిపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది.

OTT Films: ఈ వారం అరడజను సినిమాలు.. ఫుల్ మీల్స్ ఇస్తున్న ఓటీటీలు!

ఇండియన్ సూపర్ మ్యాన్ తరహా కాన్సెప్ట్ తో సౌత్ టు నార్త్ హోప్స్ పెట్టుకున్న మిన్నాల్ మురళీ. ఒరిజనల్ మలయాళీ అయినా అన్నీ లాంగ్వెజెస్ లో వరల్డ్ వైడ్ ఈ మూవీని డిసెంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ చేస్తుంది నెట్ ఫ్లిక్స్. కానీ ఇదే రోజు అక్షయ్ కుమార్, ధనుశ్, సారా అలీఖాన్ లీడ్ రోల్స్ చేసిన అత్రాంగీ రే రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. అందులో అక్షయ్, ధనుష్ లకు ఇండియా వైడ్ ఫాలోయింగ్ ఉంది. సో మిన్నాళ్ మురళీకి దెబ్బపడే అవకాశం ఉంది.

×