OTT Release: తగ్గేదే లే అంటున్న ఓటీటీలు.. ఈ వారం పది సినిమాలు!

ఎప్పటిలాగానే ఈ వారం కూడా తగ్గేదే లే అంటున్నాయి ఓటీటీలు. సీనియర్ స్టార్ వెంకీ తన రెండో దృశ్యాన్ని ఈ గురవారమే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇక డిజిటల్ ప్లాట్ ఫాంపై ఆకాశ్ పూరీ..

OTT Release: తగ్గేదే లే అంటున్న ఓటీటీలు.. ఈ వారం పది సినిమాలు!

Ott Release

OTT Release: ఎప్పటిలాగానే ఈ వారం కూడా తగ్గేదే లే అంటున్నాయి ఓటీటీలు. సీనియర్ స్టార్ వెంకీ తన రెండో దృశ్యాన్ని ఈ గురవారమే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇక డిజిటల్ ప్లాట్ ఫాంపై ఆకాశ్ పూరీ రొమాంటిక్ రచ్చ కూడా షురూ కాబోతుంది. సీనియర్ స్టార్ దృశ్యం 2 నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. నిజానికి కొవిడ్ తర్వాత థియేటర్స్ లో సినిమాల సందడి చూసి.. దృశ్యం 2 కూడా థియేటర్స్ కే వస్తుందనుకున్నారు.

Jr NTR-Allu Arjun: వెకేషన్ టైమ్.. ఫ్యామిలీతో చిల్ అవుతున్న స్టార్లు!

బట్ ఆల్ ఆఫ్ సడెన్ గా ఓటీటీ ఎంట్రీ ఇస్తుందన్నారు నిర్మాత సురేశ్ బాబు. ఇక ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వకుండా దృశ్యం 2ను రిలీజ్ చేసేస్తున్నారు. సినిమా హాళ్లలో దృశ్యం ఫస్ట్ పార్ట్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇప్పటికే రిలీజైన దృశ్యం 2 మలయాళ వర్షన్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ తెలుగు ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండటంతో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి ప్రేక్షకుల్లో.

Release Clashes: ఇండియన్ సినిమాకి పాన్ ఇండియా ప్రాబ్లమ్స్..!

అవికాగోర్, నవీన్ చంద్ర లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ‘బ్రో’. అన్నాచెల్లెల అనుబంధంపై తెరకెక్కిన ఓ ఫెంటాస్టిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని మేకర్స్ చెప్తున్నారు. కార్తిక్ కుపురాని దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్26న సోనీ లైవ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Theater Release Films: జోరు తగ్గిన స్టార్స్.. ఈ వారం సంపూ, రాజ్ తరుణ్‌లదే !

ఎంతో బజ్ క్రియేట్ చేసి గత నెలలో థియేటర్స్ లో సందడి చేసింది రొమాంటిక్. కొడుకు ఆకాశ్ కోసం పూరీ జగన్నాథ్ ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేయడమే కాదు.. ప్యాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లను ప్రచార బరిలో దింపారు. ఇప్పుడా రొమాంటిక్ ఆహా లోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది. నవంబర్ 26న స్ట్ర్ట్రీమింగ్ కాబోతుంది. కేతిక శర్మా అందాలు, రమ్యకృష్ణ అట్రాక్షన్, పూరీ మార్క్ డైరెక్షన్ వంటివి ఈ మూవీకి కలిసొచ్చిన అంశాలు.

Burj Khalifaపై సెలెబ్రిటీల హల్చల్.. ఈ కథేంటి?

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత రిలీజైన ఆయన సినిమా రిపబ్లిక్. తనకు తాను పబ్లిసిటీ చేసుకోపోయినా.. మెగా మేనమామలు రంగంలోకి దిగి రిపబ్లిక్ ను థియేటర్స్ లో రిలీజ్ చేసారు. పొలిటికల్ డ్రామా కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, రమ్యకృష్ణ, జగపతి బాబు లాంటి స్టార్ కాస్ట్ ఉంది. ఇక ఈ సినిమా జీ5 యాప్ లో నవంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కి రెడీఅయింది.

Seerat Kapoor: చూపులతో మాయచేయగల ముంబై భామ సీరత్!

సైకలాజికల్ హారర్ ఫిల్మ్ గా రాబోతుంది ఛోరీ. 8 నెలల ప్రెగ్నెంట్ కి ఎదురయ్యే వింత అనుభవాలతో ఈ సినమా తెరకెక్కింది. నుశృత్ భరుచా లీడ్ రోల్ చేసింది ఈ మూవీలో. ఇప్పటికే రిలీజైన ఛోరీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. వీటితో పాటూ హాక్ ఐ, వీనమ్, దిల్ బేకరర్, హిక్కప్స్ అండ్ హుక్కప్స్ వంటి సినిమాలున్నాయి ఓటీటీ రేస్ లో.