NTR 100 Years : అమెరికా టెక్సాస్ లో ‘తెలుగు హెరిటేజ్ డే’గా ఎన్టీఆర్ శత జయంతి.. అధికారిక ప్రకటన..

అమెరికాలో ఇటీవల తెలుగువారు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక టెక్సాస్ లో అయితే దాదాపు సగం మంది తెలుగు వాళ్ళే ఉంటున్నారు. ఆ రాష్ట్రంలోని పలు నగరాల్లో బిజినెస్, జాబ్స్, పలు రంగాలలో తెలుగు వారే కీలక పాత్ర పోషిస్తున్నారు.

NTR 100 Years : అమెరికా టెక్సాస్ లో ‘తెలుగు హెరిటేజ్ డే’గా ఎన్టీఆర్ శత జయంతి.. అధికారిక ప్రకటన..

Sr NTR Birthday celebrate as Telugu heritage day in Frisco America

100 Years of NTR : నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను గత సంవత్సర కాలంగా ప్రపంచమంతా తెలుగు వారు జరుపుకుంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2023 మే 28 నాడు ఎన్టీఆర్ శత జయంతి కావడంతో ఆ రోజు మరింత గ్రాండ్ గా వేడుకలు నిర్వహించనున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక తెలుగు వారు ఉన్న ప్రతి చోట కూడా ఎన్టీఆర్ శత జయంతి చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో ఫ్రిస్కో నగరంలో మే 28న తెలుగు హెరిటేజ్ డే గా ప్రకటించారు. అమెరికాలో ఇటీవల తెలుగువారు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక టెక్సాస్ లో అయితే దాదాపు సగం మంది తెలుగు వాళ్ళే ఉంటున్నారు. ఆ రాష్ట్రంలోని పలు నగరాల్లో బిజినెస్, జాబ్స్, పలు రంగాలలో తెలుగు వారే కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం కూడా తెలుగు వారికి పూర్తి మద్దతు ఇస్తూ వారి కార్యక్రమాలకు సహకారం అందిస్తుంది.

NTR 100 Years : ఎన్టీఆర్ తన తల్లిని కాకుండా ‘అమ్మ’ అని పిలిచే వ్యక్తి ఎవరో తెలుసా?

దీంతో ఎన్టీఆర్ శత జయంతి ఉండటంతో ఫ్రిస్కో నగర తెలుగు ప్రజలు మే 28న పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే ఆ నగర మేయర్ జెఫ్ చేని ని కలిసి ఆ రోజు తెలుగు హెరిటేజ్ డే గా ప్రకటించామని కోరగా ఇందుకు ఆయన ఒప్పుకున్నారు. ఈ మేరకు ఒక అధికారిక నోట్ రిలీజ్ చేస్తూ.. తెలుగు వారు ఫ్రిస్కో నగరంలో ఎంతో మంది తమ సేవలు అందిస్తున్నారు. ఈ నగర అభివృద్ధికి తోడ్పడుతున్నారు. వారు సంప్రదాయాలు, సంసృతులతో మెప్పిస్తున్నారు. తెలుగువారికి ఎంతో ఇష్టమైన ప్రముఖ నటుడు, ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి శత జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయన 100వ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ జయంతి మే 28ని ఫ్రిస్కోలో తెలుగు హెరిటేజ్ డే గా ప్రకటిస్తున్నాము అని తెలిపారు. దీంతో అక్కడి ఫ్రిస్కో నగర తెలుగు ప్రజలే కాక ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన ఎన్టీఆర్ పేరిట అక్కడ అమెరికాలోని ఓ నగరంలో తెలుగు హెరిటేజ్ డే గా ప్రకటించారు అంటే అది గర్వకారణం అంటున్నారు.