Sreeleela: క్రేజీ ఆఫర్లు.. వరుస సినిమాలకు సైన్ చేస్తున్న శ్రీలీల?

స్టార్ హీరోల సినిమాల్లో ఓ యంగ్ హీరోయిన్ పేరు బాగా చక్కర్లు కొడుతుంది. ఒక్క సినిమాతో గ్లామర్ ముద్ర వేయించుకుని సందడి షురూ చేసిన ఈ కన్నడ కస్తూరి శ్రీలీల.. ఇప్పటికే కొన్ని..

Sreeleela: క్రేజీ ఆఫర్లు.. వరుస సినిమాలకు సైన్ చేస్తున్న శ్రీలీల?

Sreeleela (image:instagram)

Sreeleela: స్టార్ హీరోల సినిమాల్లో ఓ యంగ్ హీరోయిన్ పేరు బాగా చక్కర్లు కొడుతుంది. ఒక్క సినిమాతో గ్లామర్ ముద్ర వేయించుకుని సందడి షురూ చేసిన ఈ కన్నడ కస్తూరి శ్రీలీల.. ఇప్పటికే కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలకు సైన్ కూడా చేసింది. అయితే అన్నింటికి మించి అన్న రేంజ్ లో ప్రభాస్, మహేశ్, బాలకృష్ణ సినిమాల్లో ఈ బ్యూటీ నిజంగానే ఫిక్సయిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో.

Kiran Abbavaram: సెబాస్టియన్ వీడియో సాంగ్.. నీ మాట వింటే రాదా మైమరపే..!

శ్రీలీల.. పెళ్లి సందడి సినిమాతో గ్లామర్ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన కన్నడ సోయగం. ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపును తనవైపుకు తిప్పుకుని వరుసగా సినిమాలకు సైన్ చేస్తుంది శ్రీలీల. ప్రస్తుతం ధమాకా మూవీలో రవితేజ సరసన నటిస్తోంది. అయితే రీసెంట్ గా ప్రభాస్, మహేశ్ బాబు, బాలకృష్ణ లాంటి హీరోల సినిమాల్లో శ్రీలీల ఛాన్స్ కొట్టేసిందంటూ ప్రచారం ఫుల్ గా ఊపందుకుంది.

Movies Leakage: లీకుల బెడద.. ఇప్పుడు మరింత స్ట్రిక్ట్!

ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో రాజా డీలక్స్ తెరకెక్కనుందనే వార్తలొస్తున్నాయి. కేవలం 40 రోజుల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న మారుతి.. ఈ హారర్ మూవీలో ప్రభాస్ సరసన శ్రీలీలను ఒక హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు. అటు మహేశ్ – త్రివిక్రమ్ కాంబో మూవీలో శ్రీలీలకు ఓ క్రేజీ రోల్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య నటించబోయే సినిమాలోనూ శ్రీలీల ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్… అదీ బాలకృష్ణ కూతురిగా కనిపిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Pan India Movies: మన సినిమాకి మార్కెట్ క్రియేటర్లుగా పరభాషా నటులు!

సితారా ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో వస్తున్న అనగనగా ఒక రాజులో నవీన్ పొలిశెట్టి జోడీగా.. త్వరలో సెట్స్ పైకెళ్లబోయే కొత్త ప్రాజెక్ట్ లో వైష్ణవ్ తేజ్ జంటగా.. శ్రీలీలను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక వైజయంతీ మూవీస్ నిర్మించే సినిమాలో మరోసారి రోషన్ కి జంటగా శ్రీలీల మెరుస్తుందని చెప్తున్నారు. ఇలా యంగ్ హీరోలతో పాటూ స్టార్ హీరోల సినిమాల్లో ప్రస్తుతం శ్రీలీల అనే ఏకైక పేరు వినిపిస్తుండటం విశేషం. అందుకే రెమ్యునరేషన్ కూడా ఈ భామ భారీగా పెంచేసిందనే టాక్ నడుస్తోంది.