Sreeleela: ధమాకా దెబ్బకు ‘పవర్’ఫుల్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల..?
పెళ్లిసందD చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శ్రీలీల. ఈ సినిమాతో అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత మాస్ రాజా రవితేజతో కలిసి ‘ధమాకా’ మూవీలో నటించి బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మూవీతో ట్రెమెండస్ సక్సెస్‌ను అందుకుంది ఈ బ్యూటీ. ‘ధమాకా’ సినిమా అందరి అంచనాలను తారుమారు చేస్తూ పక్కా మాస్ ఎంటర్టైనర్గా సాధించిన విజయం చూసి ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు సైతం అవాక్కయ్యాయి.
Sreeleela: పెళ్లిసందD చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శ్రీలీల. ఈ సినిమాతో అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత మాస్ రాజా రవితేజతో కలిసి ‘ధమాకా’ మూవీలో నటించి బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మూవీతో ట్రెమెండస్ సక్సెస్‌ను అందుకుంది ఈ బ్యూటీ. ‘ధమాకా’ సినిమా అందరి అంచనాలను తారుమారు చేస్తూ పక్కా మాస్ ఎంటర్టైనర్గా సాధించిన విజయం చూసి ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు సైతం అవాక్కయ్యాయి.
Sreeleela: పెళ్లిసందD ఎఫెక్ట్.. హీరోయిన్‌కు ధమాకా.. హీరోకు మాత్రం జీరో!
ఈ సినిమాలో మాస్ రాజా ఎనర్జీతో సరిసమానంగా పర్ఫార్మ్ చేసింది శ్రీలీల. ఇక ఈ బ్యూటీ అందంతో పాటు డ్యాన్సులతో కూడా థియేటర్స్‌లో విజిల్ వేయించింది. అయితే ధమాకా తరువాత దర్శకుడు అనిల్ రావిపూడి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో రాబోయే సినిమాలో నటిస్తోంది శ్రీలీల. కాగా.. ఇప్పుడు మరో పవర్ఫుల్ ఆఫర్‌ను కొట్టేసిందట ఈ చిన్నది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో ఓ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాను అఫీషియల్‌గా కూడా అనౌన్స్ చేశారు.
Sreeleela: మాస్ రాజాతో పాటు శ్రీలీల కటౌట్.. ధమాకా క్రేజ్ మామూలుగా లేదుగా!
సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో పవన్ సరసన హీరోయిన్గా శ్రీలీలను సెలెక్ట్ చేసినట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. దీంతో ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఈ బ్యూటీకి నిజంగానే ఈ ఆఫర్ వస్తే మాత్రం అమ్మడి కెరీర్ ఇక నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లడం ఖాయమని పలువురు అభిప్రాయ పడుతున్నారు.