Sreeleela: మాస్ రాజాతో పాటు శ్రీలీల కటౌట్.. ధమాకా క్రేజ్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. పెళ్లిసందD చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది వెంటనే మాస్ రాజా రవితేజతో ‘ధమాకా’ సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది. దీంతో ఈ సినిమాతో తన ఫేట్ ఖచ్చితంగా మారిపోతుందని శ్రీలీల ధీమా వ్యక్తం చేస్తోంది.

Sreeleela: మాస్ రాజాతో పాటు శ్రీలీల కటౌట్.. ధమాకా క్రేజ్ మామూలుగా లేదుగా!

Sreeleela Huge Cutout Along With Raviteja Pic Goes Viral

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. పెళ్లిసందD చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది వెంటనే మాస్ రాజా రవితేజతో ‘ధమాకా’ సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది. దీంతో ఈ సినిమాతో తన ఫేట్ ఖచ్చితంగా మారిపోతుందని శ్రీలీల ధీమా వ్యక్తం చేస్తోంది.

Sreeleela : ఓ వైపు సినిమాలు.. ఓ వైపు చదువు.. హీరోయిన్ శ్రీలీల ఏం చదువుతుందో తెలుసా..??

అయితే ఈ సినిమాపై ఏర్పడ్డ అంచనాలు కూడా భారీగా ఉండటంతో ఈ సినిమాలో శ్రీలీల పాత్ర ఎలా ఉండబోతుందా అని అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్, ట్రైలర్స్‌లో ఆమె పాత్రను కొంతమేర పరిచయం చేశారు. ఇక సాంగ్స్‌లో శ్రీలీల రెచ్చిపోయి డ్యాన్స్ స్టెప్పులు వేయడంతో ఇప్పుడు ఆమె కుర్రకారుకు హాట్ ఫేవరెట్ హీరోయిన్‌గా మారింది. దీంతో తాజాగా ధమాకా సినిమా రిలీజ్ సందర్భంగా ఓ థియేటర్ వద్ద హీరో రవితేజతో పాటు శ్రీలీల భారీ కటౌట్‌ను కూడా ఏర్పాటు చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ కటౌట్‌కు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

బెంగుళూరులోని భూమిక థియేటర్ వద్ద రవితేజతో పాటు శ్రీలీల కటౌట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ బ్యూటీకి అప్పుడే ఎలాంటి క్రేజ్ క్రియేట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. మున్ముందు ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బ్యూటీకి ధమాకా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.