IPL 2022: అరుదైన జాబితాలో చేరిన ఉమ్రాన్ మాలిక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ప్లేయర్లు..

Ipl 2022
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ప్లేయర్లు ఒడిన్ స్మిత్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరాల వికెట్లు పడగొట్టాడు. నేవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో 20ఓవర్లలో 151పరుగులు మాత్రమే చేసేలా కట్టడి చేశాడు.
ఇంకా ఇదే మ్యాచ్ లో అరుదైన జాబితాలో చేరాడు. చివరిదైన 20వ ఓవర్లో సింగిల్ రన్ కూడా ఇవ్వని మరో ముగ్గురు ప్లేయర్ల సరసన చేరిపోయాడు. ఈ లిస్టులో ఇర్ఫాన్ పఠాన్ ముందుండగా, లసిత్ మలింగా, జయదేవ్ ఉనద్కత్ టాప్ 3లో ఉన్నారు.
2008లో ప్రారంభ సీజన్‌లో ఈ ప్రత్యేక మైలురాయిని సాధించిన మొదటి బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. PBKS తరపున పఠాన్ మొహాలీలో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ముంబై ఇండియన్స్ (MI)పై ఈ మెయిడిన్ సాధించాడు. ఎడమచేతి వాటం పేసర్ ఆశిష్ నెహ్రాకు వరుసగా ఆరు డాట్ బాల్స్ వేసి 66 పరుగుల తేడాతో తన జట్టును గెలిపించాడు.
Read Also: సన్‌రైజర్స్ అద్భుతమైన ఆఫర్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ను మీరే ఎంచుకోవచ్చు!
యార్కర్ స్పెషలిస్ట్ లసిత్ మలింగ ఈ ఫీట్ నమోదు చేసిన రెండో వ్యక్తి. 2009లో డర్బన్‌లో డెక్కన్ ఛార్జర్స్‌పై డబుల్ వికెట్ మెయిడిన్ బౌలింగ్ చేశాడు.
మరో పేసర్ జయదేవ్ ఉనద్కట్ ఈ చార్ట్‌లో చివరి స్థానాన్ని ఆక్రమించాడు, అద్భుతమైన ఫీట్‌ను లిఖించిన మూడో బౌలర్. రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌కు ఉనద్కత్ 2017 ఎడిషన్‌లో ఆడి హైదరాబాద్‌లో SRHపై అద్భుతమైన హ్యాట్రిక్ మెయిడిన్ అందించాడు.