Bhadrachalam : సీతారాముల కల్యాణం చూతమురారండి.. ముఖ్యమైన ఘట్టాలివే

మిథిలా స్టేడియంలో జరగనున్న కల్యాణోత్సవానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం 12 గంటలకు...పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సముహూర్తంలో...

Bhadrachalam : సీతారాముల కల్యాణం చూతమురారండి.. ముఖ్యమైన ఘట్టాలివే

Sri Rama Navami

Sree Seetha Ramula Kalyanam : భద్రాచలంలో రాములోరి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరగనుంది. మిథిలా స్టేడియంలో జరగనున్న కల్యాణోత్సవానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం 12 గంటలకు…పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సముహూర్తంలో…శ్రీరాముడు, సీతాదేవికి కల్యాణం జరగనుంది. ఈ కమనీయ వేడుకను తిలకించేందుకు తెలంగాణ నుంచే కాదు, ఏపీ, చత్తీస్‌గడ్‌, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

Read More : Bhadradri : రాములోరి పెళ్లి.. కనులకు రమణీయం, పోటెత్తిన భక్తులు

ఉదయం 8:00 నుండి 9:00 గంటల వరకు శ్రీ స్వామివారికి ధ్రువమూర్తుల (మూలమూర్తుల తిరుకళ్యాణం ఏకాంతం).
9 గంటల నుండి 9.30 గంటల వరకు ఉత్సవమూర్తులకు అలంకారం.
9.30 గంటల నుండి 10:30 గంటల వరకు శ్రీ సీతారామ ఉత్సవ మూర్తులకు ఆలయం నుండి ఊరేగింపు.
10.30గంటల నుండి 12:30 గంటల వరకు కల్యాణ మండపంలో శ్రీ సీతారాముల తిరు కల్యాణం.
మధ్యాహ్నం 12:30 గంటల నుండి 1.00 గంటల వరకు ఉత్సవమూర్తులను కళ్యాణ మండపం నుండి ఆలయానికి ఊరేగింపు.
1.00 గంటల నుండి 2 గంటల వరకు మద్యహ్మిక ఆరాధన రాజభోగం.
2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దర్శనం ఒక్కొక్కరికి 100 రూపాయల టికెట్.

Read More : Sriramanavami : శ్రీరామ శోభాయాత్ర.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు

శనివారం రాత్రి రామాలయం ప్రాంగణంలో ఎదుర్కోలు ఉత్సవం, గరుడు సేవ కన్నుల పండువగా జరిగాయి. సీతారాముల ఆలయ ప్రాంగణంలోని ఉత్తర ద్వారం వద్ద అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ఎదుర్కోలు బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ఈ ఉత్సవాన్ని తిలకించారు. సీతమ్మను వధువుగా, శ్రీరాముడిని వరుడిగా పేర్కొంటూ ఇరు వర్గాల గోత్రనామాలను పఠించారు అర్చకులు. సీతమ్మ వైపు ఉన్న వంశాల విశిష్ఠతలను స్థానాచార్యుడు తలసాయి, రాములవారి వైపు వంశాల విశిష్ఠతలను ఉప ప్రధాన అర్చకుడు శ్రీమన్నారాయణాచార్యులు తెలియజెబుతూ ఎదుర్కోలు ఉత్సవానికి పెద్దలుగా వ్యవహరించారు. ఎదుర్కోలు ఉత్సవంలో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున స్వామివారికి ఆదివారం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.